Loading...
Norton Atlas India Launch: భారత్‌లో మరోసారి టెస్టింగ్‌లో నార్టన్ అట్లాస్.. హిమాలయన్ 750కు గట్టి పోటీ!
భారత్‌లో మరోసారి టెస్టింగ్‌లో నార్టన్ అట్లాస్.. హిమాలయన్ 750కు గట్టి పోటీ!

Norton Atlas India Launch: భారత్‌లో మరోసారి టెస్టింగ్‌లో నార్టన్ అట్లాస్.. హిమాలయన్ 750కు గట్టి పోటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 27, 2026
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్‌పై దృష్టి సారించింది. కంపెనీకి చెందిన అడ్వెంచర్ బైక్ 'నార్టన్ అట్లాస్' ఇప్పటికే పలుమార్లు భారత్‌లో టెస్టింగ్ చేస్తూ కనిపించింది. తాజాగా మరోసారి టెస్ట్ రన్‌లో దర్శనమిచ్చింది. ఈసారి బైక్ వెనుక భాగంలో రియర్ టాప్ బాక్స్ కూడా కనిపించింది. ఇది ప్రస్తుతం యూకే మార్కెట్లో యాక్సెసరీగా అందుబాటులో ఉంది. త్వరలో భారత్‌లో విడుదలయ్యే అవకాశం ఉండటంతో కంపెనీ దేశీయ రోడ్లపై పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి వస్తే ఈ బైక్ ప్రధానంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750కు పోటీ ఇవ్వనుంది.

వివరాలు

డిజైన్, ఫీచర్లు అదుర్స్

తాజాగా కనిపించిన నార్టన్ అట్లాస్ టెస్ట్ మ్యూల్.. మ్యాట్రిక్స్ బ్లాక్ కలర్ వేరియంట్‌గా కనిపిస్తోంది. విదేశీ మార్కెట్లలో విక్రయిస్తున్న మోడల్‌తో పోలిస్తే డిజైన్‌లో పెద్దగా మార్పులేమీ లేవు.

వెనుక టాప్ బాక్స్‌ను పరిశీలిస్తే భారత్‌లో వినియోగానికి అనుగుణంగా బైక్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌లో ట్విన్ ప్రొజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ప్రత్యేకమైన ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కార్నరింగ్ లైట్లు, పుడిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

పెద్ద విండ్‌షీల్డ్, హ్యాండ్ గార్డ్స్, స్పోర్టీ రియర్ వ్యూ మిర్రర్స్, స్టెప్డ్ సీట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ఫ్యూయల్ ట్యాంక్, షోల్డర్ ఎక్స్‌టెన్షన్లు, సైడ్ ప్యానెల్స్‌ను సమన్వయంతో రూపొందించి ఆధునిక డిజైన్‌ను అందించారు.

వివరాలు

585 సీసీ ఇంజిన్.. 70 హెచ్‌పీ పవర్

నార్టన్ అట్లాస్‌లో లిక్విడ్ కూల్డ్ 585 సీసీ, డీఓహెచ్‌సీ, 270 డిగ్రీ క్రాంక్ పారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. మల్టీ పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్, రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీతో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 70 హెచ్‌పీ పవర్, 57.5 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, బై డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్ కూడా అందించారు.

బైక్‌కు స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్, కాస్ట్ అల్యూమినియం స్వింగ్‌ఆర్మ్ అమర్చారు. సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో పూర్తిగా అడ్జస్ట్ చేసుకునే KYB 43 ఎంఎం యూఎస్‌డీ ఫోర్కులు, వెనుక KYB మోనోషాక్ ఉన్నాయి. రెండూ 180 ఎంఎం ట్రావెల్‌ను అందిస్తాయి.

ADVERTISEMENT

వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750తో పోటీ

భారత మార్కెట్లో నార్టన్ అట్లాస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 నిలవనుంది. ఈ బైక్‌ను ఇటీవల యూకే మార్కెట్లో పరిచయం చేశారు.

భారత్‌లో త్వరలో జరగనున్న మోటోవర్స్ ఈవెంట్‌లో హిమాలయన్ 750 లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.

హిమాలయన్ 750లో 743 సీసీ పారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 55 హెచ్‌పీ పవర్, 63 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇంజిన్ సామర్థ్యం పరంగా హిమాలయన్ ముందున్నప్పటికీ.. పవర్ విషయంలో నార్టన్ అట్లాస్ మెరుగైన గణాంకాలను కలిగి ఉంది.

ADVERTISEMENT

వివరాలు

ధర ఎంత ఉండొచ్చు?

ప్రస్తుతం యూకే మార్కెట్లో నార్టన్ అట్లాస్ ధరలు 8,250 నుంచి 9,450 పౌండ్ల మధ్య ఉన్నాయి. భారత కరెన్సీలో సుమారు రూ.9.98 లక్షల నుంచి రూ.11.44 లక్షల వరకు ఉంటుంది.

మరోవైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 యూకేలో 6,999 నుంచి 8,699 పౌండ్ల ధరలతో అందుబాటులో ఉంది.

అంటే భారత కరెన్సీలో సుమారు రూ.8.47 లక్షల నుంచి రూ.10.53 లక్షల వరకు ఉంటుంది. ఈ ధరలను బట్టి నార్టన్ అట్లాస్‌ను భారత్‌లో మరింత ప్రీమియం అడ్వెంచర్ బైక్‌గా తీసుకొచ్చే అవకాశం ఉంది.

అయితే దేశీయ మార్కెట్‌లో దీని ధర, లాంచ్ తేదీపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ADVERTISEMENT