Ola: ఓలా నుంచి కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 301 కి.మీ. రేంజ్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లోకి మరో కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది. మాస్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని ఓలా ఎస్1జడ్ (Ola S1Z) పేరుతో ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. తక్కువ ధరలో ఎక్కువ రేంజ్‌ను అందించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
వివరాలు
రెండు బ్యాటరీ ఆప్షన్లు..
ఓలా ఎస్1జడ్ స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
3.1kWh, 5.1kWh బ్యాటరీ ప్యాక్‌లతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. 3.1kWh బ్యాటరీ వేరియంట్ ధర రూ.79,999 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు.
ఈ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌పై 179 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఇక 5.1kWh బ్యాటరీతో వచ్చే వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్‌షోరూమ్)గా ఉంది.
ఈ స్కూటర్ ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 301 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని ఓలా తెలిపింది. మొత్తం నాలుగు రంగుల్లో ఎస్1జడ్ లభించనుంది.
వివరాలు
భారత్ సెల్ ఎల్‌ఎఫ్‌పీ టెక్నాలజీ..
ఈ స్కూటర్‌లో ఓలా సొంతంగా అభివృద్ధి చేసిన భారత్ సెల్ ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ టెక్నాలజీని ఉపయోగించింది.
ఈ టెక్నాలజీని ఇన్‌హౌస్‌గా అభివృద్ధి చేయడం ద్వారా బ్యాటరీ తయారీ ఖర్చును గణనీయంగా తగ్గించగలిగామని కంపెనీ వెల్లడించింది.
తక్కువ ధరలో స్కూటర్‌ను అందించినప్పటికీ పనితీరు, ఫీచర్ల విషయంలో రాజీపడలేదని ఓలా పేర్కొంది.
ఈ స్కూటర్‌ను కంపెనీకి చెందిన గిగా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు తెలిపింది.
వివరాలు
డెలివరీలు ఎప్పటి నుంచి?
3.1kWh బ్యాటరీతో కూడిన ఎస్1జడ్ స్కూటర్ల డెలివరీలను ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ఓలా ప్రకటించింది.
ఇక 5.1kWh బ్యాటరీ వేరియంట్ డెలివరీలు వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఓలా ఎస్1జడ్ స్కూటర్‌లో కంపెనీ మూవ్ ఓఎస్ 5 (MoveOS 5) ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించింది.
ఇందులో క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్, జీపీఎస్, ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అలాగే జియో, టైమ్, మోడ్ ఫెన్సింగ్ వంటి ఇతర సదుపాయాలను కూడా అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
తక్కువ ధరకు ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేలా ఎస్1జడ్‌ను రూపొందించినట్లు ఓలా పేర్కొంది.