MotoGP భారత్ ఈవెంట్లో ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ ప్రదర్శన: వాటి ప్రత్యేకతలు తెలుసుకోండి
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎప్పుడో ఎంట్రీ ఇచ్చిన ఓలా కంపెనీ ప్రస్తుతం నాలుగు ఈ-బైక్స్ ని మార్కెట్లోకి తీసుకువస్తుంది. వీటి గురించి గత నెలలోనే వెల్లడి చేసిన ఓలా సంస్థ, ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలో జరుగుతున్న మోటీ జీపీ భారత్ ఈవెంట్లో ఈ బైక్ లను ప్రదర్శనకు ఉంచింది. సరికొత్త ఎలక్ట్రిక్ బైక్స్ డిజైన్ విభిన్నంగా ఉండడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డైమండ్ హెడ్, క్రూజర్, రోడ్ స్టర్, అడ్వెంచర్ అనే నాలుగు మోడల్స్ లో బైక్స్ ని తీసుకువచ్చింది ఓలా సంస్థ.
నాలుగు మోడల్స్ బైకుల ఫీచర్లు ఇవే
డైమండ్ హెడ్ మోడల్ బైక్ డిజైన్ సరికొత్తగా ఉంటుంది. దీన్ని స్పోర్ట్స్ బైక్ గా తీసుకొచ్చారు. మిగిలిన వాటిల్లో అడ్వెంచర్ బైక్ ని ప్రత్యేకంగా ఆఫ్ రోడ్ ప్రయాణాల కోసం తయారు చేశారు. మోనో షాక్ అబ్సార్బర్స్, చైన్ డ్రైవ్, స్పోక్ వీల్స్ వంటి ఫీచర్లతో అడ్వెంచర్ బైక్ మోడల్ ఎక్కువగా ఆకర్షిస్తోంది. క్రూజర్ బైక్ మోడల్ ఫీచర్ల విషయానికొస్తే ఎల్ఈడి హెడ్ లాంప్, ఫ్రంట్ సీట్ ఫుట్ పెగ్, పెద్ద హ్యాండిల్, 17 అంగుళాల చక్రాలు, వెనకాల టైర్ కి మోనో షాక్ అబ్జర్వర్ ఉన్నాయి. రోడ్ స్టర్ బైక్ మోడల్ ఫీచర్లలో ఎల్ఈడి హెడ్ లాంప్, స్ప్లిట్ సీట్స్, షార్ప్ బాడీ ప్యానెల్ ఉన్నాయి.