
Ola S1 Pro Sport: ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్.. ఒక్కసారి ఛార్జ్‌తోనే హైదరాబాద్-విజయవాడ ప్రయాణం!
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఓలా ఎస్1 ప్రో స్పోర్ట్'ని లాంచ్ చేసింది. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లతో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే కావడం ప్రత్యేకత. డిజైన్ హైలైట్స్ ఈ కొత్త మోడల్ షార్ప్ లుక్‌తో ఆకర్షిస్తుంది. ఎయిరోడైనమిక్స్‌కి అనుగుణంగా ఆప్టిమైజ్ చేసిన బాడీవర్క్, చిన్న విండ్స్‌క్రీన్, కార్బన్ ఫైబర్ ఫ్రంట్ ఫెండర్, స్టైలిష్ గ్రాబ్ రైల్, కొత్తగా డిజైన్ చేసిన సీటుతో వస్తోంది. అదనంగా LED లైటింగ్ సెటప్‌తో పాటు డేటైమ్ రన్నింగ్ లైట్ (DRL) కూడా అందించారు.
Details
ADAS ఫీచర్లు
ఇది మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో, ఇందులో ఎన్నో సేఫ్టీ ఫీచర్లను జోడించారు. వాటిలో కొలిజన్ వార్నింగ్ బ్లైండ్ స్పాట్ అలర్ట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ట్రాఫిక్ సిగ్నల్ రికగ్నిషన్ స్పీడింగ్ అలర్ట్ ప్రత్యేక టెక్నాలజీ ముందు భాగంలో ఇచ్చిన కెమెరా డ్యాష్‌క్యామ్‌లా పనిచేస్తుంది. ఇది రైడ్‌లను రికార్డ్ చేయడమే కాకుండా, థెఫ్ట్‌కు సంబంధించిన వీడియోలను కూడా సేవ్ చేస్తుంది.
Details
పర్ఫార్మెన్స్
టాప్ స్పీడ్ - 152 km/h 0-40 km/h - కేవలం 2 సెకన్లలో మోటర్ పవర్ - 16 kW టార్క్ - 71 Nm బ్యాటరీ ప్యాక్ - 5.2 kWh రేంజ్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 320 కి.మీ. వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ (280 కి.మీ) వరకు సులభంగా వెళ్లిపోవచ్చు. ధర & బుకింగ్స్ ఇం ట్రొడక్టరీ ఎక్స్‌షోరూం ప్రైజ్ - రూ. 1,49,999 బుకింగ్ అమౌంట్ - రూ. 999 డెలివరీలు - జనవరి 2026 నుంచి ప్రారంభం