
Harley Davidson: హార్లే డేవిడ్‌సన్ X440 బుకింగ్స్ జోరు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఇటీవల హార్లే డేవిడ్‌సన్ ఎక్స్ 440 ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఈ వాహనం బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఇప్పటివరకూ 25,597 యూనిట్లకు బుకింగ్స్ వచ్చినట్లు హీరో మోటోకార్ప్ వెల్లడించింది. జులై 4న బుకింగ్స్ ను ప్రారంభించగా, ఇప్పటికి తొలి విడత బుకింగ్ ప్రక్రియ ముగిసిందని తెలిపింది.
మరికొద్ది రోజుల్లో రెండో విడత్ బుకింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని హీరో మోటో కార్ప్ స్పష్టం చేసింది.
Details
అక్టోబర్ నుంచి కస్టమర్లకు డెలవరీలు
తాము తీసుకొచ్చిన హార్లే డేవిడ్‌సన్ ఎక్స్ 400 వాహనానికి ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చిందని, టాప్ ఎండ్ మోడల్స్ కే ఎక్కువ సంఖ్యలో బుకింగ్స్ వచ్చాయని హీరో మోటార్ కార్ప్ సీఈఓ నిరంజన్ గుప్తా పేర్కొన్నారు.
సరైన బ్రాండ్, మోడల్ ఉంటే ఎంత ధర పెట్టినా కొనుగోలు చేయడానికి కస్టమర్లు వెనకాడరు అనడానికి ఈ బుకింగ్స్ నిదర్శమని, ప్రీమియం సెగ్మెంట్‌లో ఇది తమ తొలి అడుగు మాత్రమేనని వెల్లడించారు.
అక్టోబర్ నుంచి కస్టమర్లకి డెలివరీలు ఇవ్వనున్నారు. దీని ధర రూ.2.39 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.