LOADING...
VinFast : భారత్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ధరల పెంపు
భారత్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ధరల పెంపు

VinFast : భారత్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల ధరల పెంపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 12, 2026
09:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

వియత్నాం ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారత్‌లో తన ఎలక్ట్రిక్ SUVలు VF6, VF7 ధరలను పెంచింది. గరిష్టంగా రూ. 1.3 లక్షల వరకు ధరలు పెరిగాయి. ఈ ధరల పెంపుతో కంపెనీ ప్రవేశపెట్టిన ఇంట్రడక్టరీ ప్రైసింగ్ ఆఫర్‌కు ముగింపు పలికినట్టైంది. కొత్త ధరలు త్వరలోనే విన్‌ఫాస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ కానున్నాయి. VinFast VF6 ధర ₹90 వేల వరకు పెంపు Earth వేరియంట్ ధరను రూ.80,000 పెంచారు. Wind, Wind Infinity వేరియంట్ల ధరలు ఒక్కోటి రూ. 90,000 చొప్పున పెరిగాయి. దీంతో VF6 యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.29 లక్షలకు చేరింది.

Details

VinFast VF7 ధర ₹1.3 లక్షల వరకు పెరిగింది 

ఈ ఎలక్ట్రిక్ SUVలో 59.6kWh లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది ఫ్రంట్ యాక్సిల్‌పై అమర్చిన ఎలక్ట్రిక్ మోటర్‌కు శక్తినిస్తుంది. వేరియంట్‌ను బట్టి పవర్ అవుట్‌పుట్‌లో తేడా ఉంటుంది. VF7 మోడల్‌పైనా గణనీయమైన ధరల పెంపు జరిగింది. Earth వేరియంట్ ధర రూ.1 లక్ష పెరిగింది Wind వేరియంట్ ధర రూ.1.2 లక్షలు Sky వేరియంట్ ధర రూ.1.3 లక్షలు పెరిగాయి. దీంతో VF7 యొక్క ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.89 లక్షలకు చేరింది. ఈ మోడల్‌లో రెండు బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. 59.6kWh బ్యాటరీ యూనిట్ 70.8kWh బ్యాటరీ యూనిట్ వేరియంట్‌ను బట్టి పవర్, పనితీరు భిన్నంగా ఉంటుంది.

Details

విన్ ఫాస్ట్‌ బలమైన అమ్మకాలు

ధరలు పెరిగినప్పటికీ విన్ ఫాస్ట్‌ అమ్మకాల పరంగా మంచి ఫలితాలు సాధిస్తోంది. 2025 క్యాలెండర్ సంవత్సరంలో విన్ ఫాస్ట్‌ మొత్తం 826 యూనిట్లు విక్రయించింది. వోల్వో - 389 యూనిట్లు, టెస్లా 225 యూనిట్లు మాత్రమే విక్రయించాయి. ఈ గణాంకాల ప్రకారం VinFast, భారత్‌లో కొన్ని ప్రముఖ బ్రాండ్లను కూడా అమ్మకాల పరంగా వెనక్కి నెట్టింది. ధరల పెంపు తరువాత కూడా విన్ ఫాస్ట్‌ తన అమ్మకాల ఊపును కొనసాగించగలదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Advertisement