
Kinetic DX Electric Scooter: 100 కిమీకి మించి రేంజ్.. తక్కువ ధరలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ఐకానిక్ కైనెటిక్ గ్రూప్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహన విభాగమైన కైనెటిక్ వాట్స్ అండ్ వోల్ట్స్ లిమిటెడ్ ఎట్టకేలకు తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'కైనెటిక్ డీఎక్స్'ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్కూటర్ ధరను రూ.1.12 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, మరో వేరియంట్ అయిన డీఎక్స్+ ధర రూ.1.17 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది గతంలో ప్రజాదరణ పొందిన 'కైనెటిక్ హోండా డీఎక్స్' మోడల్‌ను గుర్తు చేసేలా రూపొందించారు.
Details
అద్భుత డిజైన్
కైనెటిక్ డీఎక్స్ స్కూటర్ డిజైన్ పరంగా పురాతన డీఎక్స్ మోడల్ నుంచి స్పూర్తి పొందింది. అయితే ఇందులో ఆధునిక ఫీచర్లు, స్టైలింగ్‌ను సమపాళ్లలో మిళితం చేశారు. ప్రతి ప్యానెల్ డీఎక్స్ స్టైల్‌ను ప్రతిబింబించడంతో పాటు, తాజా డిజైన్ శైలికి అనుగుణంగా ఉన్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ-స్కూటర్‌లో ప్రత్యేక ఎల్ఈడీ హెడ్‌లైట్, కైనెటిక్ లోగోతో కూడిన డేటైమ్ రన్నింగ్ లైట్లు, బ్రాండెడ్ వైజర్ వంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ మోడల్‌ను ఇతర మోడళ్లతో పోల్చినపుడు ప్రత్యేకతనిస్తుంది.
Details
వేగంగా ఎదుగుతున్న ఈవీ మార్కెట్లోకి డీఎక్స్ ఎంట్రీ
ఇండియన్ ఈవీ మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. ఈ పోటీలోకి తాజాగా ఎంట్రీ ఇచ్చిన కైనెటిక్ డీఎక్స్, టీవీఎస్ ఐక్యూబ్, విడా వీఎక్స్2, ఏథర్ రిజ్టా, హోండా యాక్టివా ఈ, బజాజ్ చేతక్ వంటి ప్రముఖ మోడళ్లకు పోటీగా నిలుస్తుంది
Details
కైనెటిక్ డీఎక్స్ vs విడా వీఎక్స్2
కైనెటిక్ డీఎక్స్ ధర రూ.1.12 - 1.17లక్షల మధ్య ఉండగా విడా వీఎక్స్2 స్కూటర్ రూ.99,490 - 1.1 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తోంది. విడా వీఎక్స్2 రెండు వేరియంట్‌లలో - వీఎక్స్2 ప్లస్, వీఎక్స్2 గో - అందుబాటులో ఉంది. విడా స్కూటర్‌కు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా లభిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు తక్కువ ప్రారంభ వ్యయంతో వాహనాన్ని పొందొచ్చు, కానీ కిలోమీటర్‌కు సగటుగా రూ.0.96 చెల్లించాలి. కైనెటిక్ డీఎక్స్+ 2.6 కేడబ్ల్యూహెచ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్(LPF)బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే 116 కిలోమీటర్ల వరకు IDC సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. 6.4 బీహెచ్‌పీ గరిష్ట పవర్‌ను ఉత్పత్తి చేసే పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది.
Details
మెరుగైన మైలేజీ
విడా వీఎక్స్2 విషయానికి వస్తే, 'వీఎక్స్2 గో'లో ఒకే రిమూవబుల్ బ్యాటరీ ఉండగా, వీఎక్స్2 ప్లస్ రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. వీటిలో గో వేరియంట్‌లో 2.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉండగా, ప్లస్ వేరియంట్‌లో 3.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంది. ఫుల్ ఛార్జ్‌పై గో వేరియంట్ 92 కిమీ, ప్లస్ వేరియంట్ 142 కిమీ వరకు ప్రయాణించగలదు. వేగం పరంగా, గో మోడల్ 70 కేఎంపీహెచ్, ప్లస్ మోడల్ 80 కేఎంపీహెచ్ గరిష్ట వేగాన్ని అందిస్తుంది. కైనెటిక్ డీఎక్స్ తన నాస్టాల్జిక్ డిజైన్‌తో పాతతరాన్ని ఆకర్షిస్తే, ఆధునిక ఫీచర్లతో కొత్త తరం వినియోగదారుల దృష్టిని కూడా ఆకర్షించేందుకు సిద్ధమైంది.