Range Rover: రూ.1.90 కోట్లకు రేంజ్ రోవర్ స్పోర్ట్ 'ట్వెంటీ ఎడిషన్' లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
లగ్జరీ ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకునేలా జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) భారత్‌లో రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వెంటీ ఎడిషన్‌ను విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌గా తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ.1.90 కోట్లు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించింది. ఈ ప్రత్యేక మోడల్‌కు సంబంధించిన డెలివరీలు అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వివరాలు
2004 రేంజ్ స్టార్మర్ కాన్సెప్ట్ స్ఫూర్తితో..
రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వెంటీ ఎడిషన్‌ను 2004లో ప్రదర్శించిన రేంజ్ స్టార్మర్ కాన్సెప్ట్ స్ఫూర్తితో రూపొందించారు.
ఇందులో ఆటోబయోగ్రఫీ, SV ట్రిమ్‌లకు చెందిన పలు ప్రత్యేక డిజైన్ అంశాలను జోడించారు.
ఈ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో ప్రత్యేకంగా 'TWENTY' బ్రాండింగ్‌ను అందించారు.
23 అంగుళాల గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను కూడా ఆప్షన్‌గా అందిస్తున్నారు.
వివరాలు
ఆకట్టుకునే ఆరెంజ్ కలర్..
ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన 'Sanguinello Orange' రంగును అందించారు.
2004 రేంజ్ స్టార్మర్ కాన్సెప్ట్, Vesuvius Orange First Edition నుంచి ఈ రంగుకు స్ఫూర్తి పొందారు.
క్యాబిన్‌లో ఎబోనీ విండ్సర్ లెదర్ సీట్లు, స్వెడ్ హెడ్‌లైనింగ్‌తో పాటు 'TWENTY' బ్రాండింగ్‌ను అందించారు.
దీంతో సాధారణ రేంజ్ రోవర్ స్పోర్ట్ మోడళ్లతో పోలిస్తే ఈ ఎడిషన్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.
వివరాలు
537 హెచ్‌పీ పవర్.. 750 ఎన్ఎం టార్క్..
రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వెంటీ ఎడిషన్‌లో ట్విన్-టర్బో మైల్డ్-హైబ్రిడ్ V8 ఇంజిన్‌ను అమర్చారు.
ఇది గరిష్ఠంగా 537 హెచ్‌పీ పవర్, 750 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
అద్భుతమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ఇంజిన్‌ను కలిగి ఉన్న ఈ ప్రత్యేక ఎస్‌యూవీ.. భారత మార్కెట్లో JLR లగ్జరీ ఎస్‌యూవీ లైనప్‌లో మరో ఆకర్షణీయమైన మోడల్‌గా నిలవనుంది.