Electric Scooter for woman : స్టైలిష్ లుక్‌తో 'రాణి' ఎడిషన్ ఈ-స్కూటర్.. ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈవీ తయారీ సంస్థ జెలో ఎలక్ట్రిక్ తన ప్రజాదరణ పొందిన స్కూటర్ మోడల్ Zelo Night+కు ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. 'నైట్+ రాణి' పేరుతో ఈ కొత్త వెర్షన్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ ద్విచక్ర వాహన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకువచ్చినట్లు కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్ కేవలం 999 యూనిట్లకు మాత్రమే పరిమితం. ప్రత్యేకమైన డిజైన్, ఆకర్షణీయమైన రంగులతో ఇది వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Details
ప్రత్యేకతలు, డిజైన్
ఈ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణ దాని రంగు. బేబీ పింక్ థీమ్ స్కూటర్ మొత్తం 'బేబీ పింక్' రంగులో ఉండి, వైట్ ప్యానెల్స్‌తో కాంట్రాస్టింగ్ లుక్‌ను ఇస్తుంది. డిజైన్ సాధారణ నైట్+ మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్పులతో మరింత స్టైలిష్‌గా రూపొందించారు. ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ డిజైన్ ఉందని కంపెనీ పేర్కొంది.
Details
పర్ఫార్మెన్స్, బ్యాటరీ
మెకానికల్ పరంగా ఈ స్పెషల్ ఎడిషన్‌లో పెద్దగా మార్పులు లేవు. ఇది ఇప్పటికే ఉన్న నైట్+ ప్లాట్‌ఫామ్‌పైనే పనిచేస్తుంది. బ్యాటరీ 1.8 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల పోర్టబుల్ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీనిని స్కూటర్ నుంచి వేరు చేసి విడిగా కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. రేంజ్ ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. వేగం 1.5 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో గరిష్టంగా గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. నగర ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది.
Details
అదిరిపోయే ఫీచర్లు
తక్కువ ధరలోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పలు ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. హిల్ హోల్డ్ కంట్రోల్: ఎత్తు పల్లాల రోడ్లు లేదా ఫ్లైఓవర్లపై స్కూటర్ వెనక్కి జారకుండా సహాయపడుతుంది. క్రూయిజ్ కంట్రోల్: దీర్ఘ ప్రయాణాల్లో ఒకే స్థిరమైన వేగంతో వెళ్లే సౌకర్యం. ఫాలో మీ హోమ్ హెడ్‌ల్యాంప్స్: స్కూటర్ పార్క్ చేసిన తర్వాత కూడా కొంతసేపు లైట్లు వెలుగుతూ ఉంటాయి. యూఎస్‌బీ ఛార్జింగ్: ప్రయాణంలో మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
Details
ధర, లభ్యత
దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 69,990గా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా ఉన్న జెలో ఎలక్ట్రిక్ డీలర్ల వద్ద ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం 999 స్కూటర్లు మాత్రమే ఉత్పత్తి చేయనున్నందున వీటికి భారీ డిమాండ్ ఉండే అవకాశముందని కంపెనీ భావిస్తోంది. ఈ సందర్భంగా కంపెనీ కో-ఫౌండర్ ముకుంద్ బహేతి మాట్లాడుతూ, దేశంలో 'రాణి' అనే పదానికి ఉన్న విలువను గుర్తిస్తూ మా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు ఈ రంగును ఎంచుకున్నాం. కాన్ఫిడెన్స్, నిర్ణయ సామర్థ్యం, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ కొత్త ఎడిషన్‌ను రూపొందించామని తెలిపారు.