LOADING...
Honda Prelude: స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ పవర్.. హోండా ప్రెల్యూడ్ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ
20 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. హోండా ప్రిల్యూడ్ అదిరే డిజైన్‌తో తిరిగి రాక

Honda Prelude: స్టైలిష్ డిజైన్, హైబ్రిడ్ పవర్.. హోండా ప్రెల్యూడ్ గ్రాండ్‌గా రీ-ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్‌లో తన పట్టును మళ్లీ బలోపేతం చేసేందుకు జపాన్ దిగ్గజం హౌండా భారీ ప్రణాళికతో ముందుకు వస్తోంది. 2030 నాటికి దేశంలో 10 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో తన ఐకానిక్ మోడల్ హోండా ప్రిల్యూడ్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకురానుంది. దాదాపు 20 ఏళ్ల విరామం తర్వాత, ఈ కారు సరికొత్త హైబ్రిడ్ రూపంలో భారత రోడ్లపైకి రానుంది.

వివరాలు

20 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ

ఒకప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో క్రేజ్ సృష్టించిన హోండా ప్రెల్యూడ్ ఇప్పుడు ఆరవ తరం మోడల్‌గా తిరిగి వస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయాలు ప్రారంభమైన ఈ టూ-డోర్ కూపేను భారత్‌కు CBU (Completely Built Unit) రూపంలో దిగుమతి చేయనున్నారు. అంటే విదేశాల్లో తయారైన కారును నేరుగా ఇక్కడ అమ్మకానికి తీసుకురానున్నారు.

వివరాలు

డిజైన్, డైమెన్షన్స్

ఈ కాంపాక్ట్ కూపే పొడవు 4,520 మిల్లీమీటర్లు. ఇందులో 2+2 సీటింగ్ లేఔట్ ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్: 135 మిల్లీమీటర్లు మాత్రమే ఉండటంతో భారత రోడ్లపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల వద్ద డ్రైవింగ్ కొంత సవాలుగా ఉండొచ్చు. సీటింగ్: వెనుక సీట్లు చిన్నపిల్లలకు అనుకూలంగా ఉంటాయి. ముందు సీట్లు మాత్రం స్పోర్టీ ఫీల్‌తో పాటు పూర్తి సౌకర్యాన్ని అందిస్తాయి.

Advertisement

వివరాలు

హైబ్రిడ్ ఇంజిన్ - పవర్, మైలేజ్

ఈ కారులో Honda Civic e:HEVలో ఉపయోగించిన టెక్నాలజీనే అమర్చారు. ఇంజిన్: 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ + రెండు ఎలక్ట్రిక్ మోటార్లు పవర్: పెట్రోల్ ఇంజిన్ 139 HP, ఎలక్ట్రిక్ మోటార్ 181 HP మరియు 315 Nm టార్క్ పర్ఫార్మెన్స్: 0 నుంచి 100 కి.మీ వేగం కేవలం 8.2 సెకన్లలో, గరిష్ట వేగం 188 కి.మీ/గంట మైలేజ్: లీటరుకు 23.6 కి.మీ, ఫుల్ ట్యాంక్‌తో సుమారు 944 కి.మీ ప్రయాణం

Advertisement

వివరాలు

స్పెషల్ ఫీచర్ - వర్చువల్ 8-స్పీడ్ గేర్‌బాక్స్

ఈ ప్రెల్యూడ్‌లో సంప్రదాయ గేర్‌బాక్స్ లేకుండా S+ Shift టెక్నాలజీని ఉపయోగించారు. ఇది 8-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌ను వర్చువల్‌గా అనుకరిస్తుంది. ప్యాడిల్ షిఫ్టర్ల ద్వారా గేర్ మార్చుతున్న అనుభూతి లభించడంతో డ్రైవింగ్ మరింత ఉత్సాహంగా ఉంటుంది. ధర, లాంచ్ హోండా ప్రెల్యూడ్ కూపే భారత్‌లో సుమారు రూ.75 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 2026 మేలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రీమియం సెగ్మెంట్‌లో తన స్థానాన్ని బలపర్చేందుకు హోండా తీసుకొస్తున్న గ్లోబల్ మోడళ్లలో ఇది కీలకంగా మారనుంది.

Advertisement