LOADING...
Renault Kwid EV: రెనాల్ట్‌ క్విడ్‌ ఈవీ.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ ఎప్పుడంటే? 
రెనాల్ట్‌ క్విడ్‌ ఈవీ.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ ఎప్పుడంటే?

Renault Kwid EV: రెనాల్ట్‌ క్విడ్‌ ఈవీ.. భారత్‌లో ఎప్పుడు లాంచ్ ఎప్పుడంటే? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత అంతర్జాతీయ ఆటో మొబైల్ సంస్థ 'రెనాల్ట్' అధికారికంగా 'క్విడ్ ఈవీ'ని ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ క్విడ్ ఇ-టెక్ పేరుతో బ్రెజిల్ మార్కెట్లో ప్రవేశించింది. ప్రత్యేకంగా ఈ మోడల్ డాసియా స్ప్రింగ్ ఈవీ ఉపయోగించిన ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. భారత రోడ్లపై టెస్ట్ వెహికిల్స్ ఇప్పటికే కనిపించడంతో, ఈ కారు త్వరలో భారత మార్కెట్‌లోకి కూడా రావచ్చని సూచిస్తోంది.

Details

 డిజైన్ & ఎగ్జీరియర్

రెనాల్ట్ క్విడ్ ఈవీ డిజైన్ డాసియా ఎలక్ట్రిక్ కార్ మోడల్ నుంచి స్పష్టమైన ప్రేరణ పొందింది. ముందుభాగంలో సాంప్రదాయ గ్రిల్ స్థానంలో క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ అమర్చారు. దీనికి వర్టికల్ ప్లేట్స్ జోడించడం ద్వారా కారు మరింత బలమైన లుక్‌ పొందింది. ప్రాజెక్టర్ హెడ్‌లైట్‌లు ఫ్రంట్ బంపర్‌కు దగ్గరగా దిగబడి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ పాత క్విడ్ ఐసీఈ వెర్షన్‌ను గుర్తుచేస్తుంది, ఇందులో నలుపు వీల్ ఆర్చ్ క్లాడింగ్‌లు, ORVM ఇండికేటర్ లైట్లు, బ్లాక్ సైడ్ క్లాడింగ్, 14-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో Y-ఆకారపు LED DRL, హాలోజెన్ రివర్స్ లైట్లు ఉన్నాయి.

Details

ఇంటీరియర్ & టెక్నాలజీ

క్విడ్ ఈవీలో క్యాబిన్ ఆధునిక, రిఫ్రెష్‌గా ఉంది. 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay సపోర్ట్‌తో 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. రెండు USB-C పోర్టులు, ఎత్తు సర్దుబాటు చేయగల స్టీరింగ్ వీల్.

Details

 భద్రతా ఫీచర్లు

భద్రతపై పూర్ణంగా దృష్టి పెట్టి, కారు ఈ క్రింది ఫీచర్లతో అందుబాటులో ఉంది. 6 ఎయిర్‌బ్యాగ్స్ ABS & ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) హిల్-స్టార్ట్ అసిస్ట్ రియర్ కెమెరా TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) సీట్‌బెల్ట్ రిమైండర్ ISOFIX చైల్డ్ సీట్స్ బ్యాటరీ & రేంజ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సామర్థ్యం: 26.8 kWh సింగిల్ ఛార్జ్ రేంజ్: 250 కి.మీ ఎలక్ట్రిక్ మోటార్ పవర్ : సుమారుగా 65 HP

Details

ధర & పోటీ

బ్రెజిల్‌లో ధర: 99,000 బ్రెజీలియన్ రియల్ (~₹16.6 లక్షలు) భారతదేశంలో లాంచ్ అయినట్లయితే టాటా టియాగో ఈవీ, సిట్రోయెన్ ఈసీ3 వంటి మోడళ్లకు కాంపిటిషన్‌గా మారే అవకాశం ఉంది. రెనాల్ట్ ఇండియా నుండి భారత లాంచ్ రాబోయే తేదీపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. త్వరలో క్లారిటీ రాబోతుంది.