Zelio E-Mobility: భారతదేశంలో లాంచ్ అయ్యిన జెలియో లిటిల్ గ్రేసీ.. ధర ఎంతంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
జీలియో ఈ-మొబిలిటీ 10 నుండి 18 సంవత్సరాల వయస్సు గల టీనేజ్ రైడర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లైసెన్స్ లెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ "లిటిల్ గ్రేసీ" ను విడుదల చేసింది.
దీని ధర రూ.49,500 గా నిర్ణయించబడింది. ఈ స్కూటర్ కొనుగోలు చేసిన తర్వాత ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఓ)లో రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు.
లిటిల్ గ్రేసీ మూడు వేర్వేరు బ్యాటరీ వేరియంట్లలో లభ్యమవుతోంది.
వివరాలు
గంటకు 25 కి.మీ వేగం
ఇందులో బేస్ మోడల్ 48V/32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ తో రాగా,దీని ధర రూ.49,500,పరిధి 55-60 కి.మీ. మిడ్-టైర్ వేరియంట్ 60V/32Ah లీడ్ యాసిడ్ బ్యాటరీ తో రూ.52,000 కాగా,దీని పరిధి 70 కి.మీ. ఇక ప్రీమియం మోడల్ 60V/30Ah లిథియం-అయాన్ బ్యాటరీ తో రాగా, దీని ధర రూ.58,000, పరిధి 70-75 కి.మీ. అన్ని మోడళ్లూ గరిష్టంగా గంటకు 25 కి.మీ వేగం కలిగి ఉంటాయి.
ఒకసారి ఛార్జింగ్ చేయడానికి సుమారు 1.5 యూనిట్ల విద్యుత్తు అవసరం.
ఈ స్కూటర్ బరువు 80 కిలోలు, లోడింగ్ సామర్థ్యం 150 కిలోలు.డిజిటల్ మీటర్,యూఎస్‌బీ పోర్ట్,కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్,రివర్స్ గేర్,పార్కింగ్ స్విచ్,ఆటో-రిపేర్ ఫంక్షనాలిటీ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.
వివరాలు
మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌పై 2 సంవత్సరాల వారంటీ
హైడ్రాలిక్ సస్పెన్షన్, డ్రమ్ బ్రేక్‌లు కలిగి ఉండే ఈ స్కూటర్ పింక్, బ్రౌన్/క్రీమ్, వైట్/బ్లూ, ఎల్లో/గ్రీన్ రంగులలో లభిస్తుంది.
మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌పై 2 సంవత్సరాల వారంటీ అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2 లక్షల కంటే ఎక్కువ కస్టమర్లు, 400+ డీలర్‌షిప్‌లు ఉన్నాయి.
2025 చివరి నాటికి 1,000+ డీలర్‌షిప్‌ల వరకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
"యువ రైడర్లకు స్థిరమైన రవాణా పరిష్కారాన్ని అందించడాన్ని మేము గర్వంగా భావిస్తున్నాం" అని జీలియో ఈ-మొబిలిటీ సహ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్ కునాల్ ఆర్య తెలిపారు.