LOADING...
రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది
రెండు స్కూటర్లకు డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి

రివర్ Indie v/s ఓలా S1 Pro ఏది కొనడం మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 24, 2023
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనం స్టార్ట్-అప్ రివర్ భారతదేశంలో తన మొట్టమొదటి ఈ-స్కూటర్, Indieని విడుదల చేసింది. మార్కెట్లో ఈ సెగ్మెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ S1 Proతో పోటీ పడుతుంది. పెద్ద అండర్-సీట్ స్టోరేజ్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో ఓలాతో పోటీ పడుతున్న Indie గురించి తెలుసుకుందాం. రివర్ Indie డ్యూయల్-పాడ్ హెడ్‌లైట్-మౌంటెడ్ ఫ్రంట్ ఆప్రాన్,ఆప్షనల్ విండ్‌స్క్రీన్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, 42-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్‌తో ఉన్న సింగిల్-పీస్ సీటు, 12-లీటర్ లాక్ చేయగల గ్లోవ్ బాక్స్, పూర్తిగా- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. ఓలా S1 Proలో DRLలతో ఉన్న డ్యూయల్-పాడ్ స్మైలీ LED హెడ్‌లైట్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సింగిల్-పీస్ సీటు, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

స్కూటర్

రైడర్ భద్రత కోసం రెండు స్కూటర్లకు డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి

రివర్ Indie 4kWh బ్యాటరీ ప్యాక్‌తో అనుసంధానించబడిన మిడ్-మౌంటెడ్ 6.7kW ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120కిమీల వరకు ప్రయాణించవచ్చు. ఓలా S1 Pro 3.97kWh బ్యాటరీతో కనెక్ట్ అయిన 8.5kW ఎలక్ట్రిక్ మోటారుతో నడుస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 181కిమీల వరకు ప్రయాణించవచ్చు. రైడర్ భద్రత కోసం రెండు స్కూటర్లకు డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) ఉన్నాయి. భారతదేశంలో, S1 Pro ధర రూ.1.39 లక్షలు, Indie ధర రూ.1.25 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). రివర్ Indie ప్రయోజనకరమైన డిజైన్ తో, సామర్థ్యం గల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో, పెద్ద అండర్-సీట్ స్టోరేజ్ ఫీచర్‌లతో S1 Pro కంటే మెరుగ్గా ఉంటుంది.