ఓలా S1 Proను డ్రైవ్ చేస్తుండగా విడిపోయిన ముందుచక్రం, ఐసియూలో చికిత్స పొందుతున్న మహిళ
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా S1 Pro భద్రత, నాణ్యత ప్రమాణాలపై మరిన్ని భయాలు పెరిగాయి. జనవరి 21న, ఒక మహిళ స్కూటర్ నడుపుతుండగా ముందు సస్పెన్షన్ విడిపోయి ముందు చక్రం విడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యి ఐసియూలో చికిత్స పొందుతుంది.
ఈ దుర్ఘటన గురించి ఆమె భర్త సోషల్ మీడియాలో పంచుకున్నారు, అయితే ఈ పోస్ట్‌కి ఓలా ఎలక్ట్రిక్ నుండి స్పందన ఇంకా రాలేదు.
బాధితురాలి భర్త సంకిత్ పర్మార్ తెలిపిన వివరాల ప్రకారం, అతని భార్య దాదాపు 35కిమీ/గం వేగంతో రాత్రి 9.15 గంటలకు ఓలా S1 Proలో ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా ముందు చక్రం విడిపోవడంతో, ఆ ధాటికి ఆమె ముందుకు వెళ్లి పడింది, తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఐసీయూలో చేర్చారు.
స్కూటర్
ఇలాంటి సంఘటన జరగడం ఇది మొదటిసారి కాదు
జనవరి 22 న, ఆ సంస్థ ప్రమాదానికి గురైన స్కూటర్‌ను తీసుకెళ్లడానికి ఒక బృందాన్ని పంపింది. రీప్లేస్‌మెంట్ మోడల్‌ను పంపుతామని పర్మార్‌కు ఆ సంస్థ తెలిపింది. అయితే, అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించాడమే కాకుండా తను ఈ బైక్ కు చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని పట్టుబట్టాడు.
మే 24, 2022న, ఒక వ్యక్తి తక్కువ వేగంతో రైడ్ చేస్తున్నప్పుడు కూడా ముందు సస్పెన్షన్ ఇలాగే విడిపోయిందని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అదే నెల 28వ తేదీన, స్పీడ్ బ్రేకర్ మీదుగా వెళుతుండగా ముందు చక్రం విడిపోయిన మరో స్కూటర్ గురించి వార్తలు వచ్చాయి. స్కూటర్ డెలివరీ అయిన ఆరు రోజులకే సస్పెన్షన్ సమస్య వచ్చిందని మరొకరు ఫిర్యాదు చేశారు.