
Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీదారు అయిన 'ఏథర్ ఎనర్జీ లిమిటెడ్', ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 'ఏథర్ రిజ్టా' (Ather Rizta) స్కూటర్‌తో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇది భారతీయ వినియోగదారుల్లో, ముఖ్యంగా కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన స్కూటర్‌గానే ఓ బ్రాండ్ హిట్‌గా నిలిచింది. మార్కెట్లోకి వచ్చిన కేవలం ఏడాది సమయంలోనే ఈ మోడల్ ఒక లక్ష యూనిట్ల అమ్మకాలను సాధించి సంచలనం రేపింది.
Details
ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రత్యేక గుర్తింపు
ఏప్రిల్ 2024లో జరిగిన ఏథర్ కమ్యూనిటీ డే సందర్భంగా ఈ స్కూటర్‌ను పరిచయం చేశారు. జూన్ 2024 నుంచి దేశవ్యాప్తంగా వాణిజ్య విక్రయాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రిజ్టా స్కూటర్ ఫ్యామిలీ సెగ్మెంట్‌లో విపరీత ఆదరణ పొందింది. నూతన ఫీచర్లు, నూతన డిజైన్, ఆచితూచి రూపొందించిన సౌలభ్యాలు ఈ స్కూటర్‌కు ప్రత్యేక స్థానం కల్పించాయి. రిజ్టా ద్వారా లక్ష యూనిట్ల మైలురాయిని చేరుకోవడం గర్వంగా ఉందని ఏథర్ ఎనర్జీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ ఫోకెలా పేర్కొన్నారు. ఇది మా వ్యాపార విస్తరణకు, వినియోగదారుల విస్తృత వర్గాన్ని చేరుకోవడానికి, పలు రాష్ట్రాల్లో మార్కెట్ వాటా పెంచుకోవడానికి కీలకంగా నిలిచింది. ఫ్యామిలీ స్కూటర్‌గా భారతీయుల అవసరాలను తీర్చే లక్ష్యంతో దీన్ని రూపొందించామన్నారు.
Details
మార్కెట్‌లో విస్తృత స్థాయిలో విజయవంతం
రిజ్టా విక్రయాలు ప్రారంభమైన తర్వాత కేవలం కొన్ని నెలల్లోనే గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఏథర్ మార్కెట్‌లో తన స్థావరాన్ని బలపరుచుకుంది. కంపెనీ మొత్తం అమ్మకాలలో రిజ్టా వాటా దాదాపు 60 శాతం చేరడం విశేషం. ఇది వినియోగదారుల ఎంపికల్లో అగ్రస్థానంలో ఉందని స్పష్టమవుతోంది. ఆకర్షణీయమైన డిజైన్, వాడకానికి అనుకూలత రిజ్టా స్కూటర్‌కు ఫ్యామిలీ ఫోకస్ ఉన్న డిజైన్, విశాలమైన సీటు, ప్రయాణ సమయంలో సౌకర్యాన్ని కలిగించే అనుకూలమైన ఫ్లోర్‌బోర్డ్, 56 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి దైనందిన ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
Details
టెక్నాలజీతో నిండిన రిజ్టా
రిజ్టాలో స్మార్ట్ టెక్నాలజీకి పెద్ద పీట వేసారు. ఇందులో కలిపిన ముఖ్య ఫీచర్లు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (స్కిడ్ కంట్రోల్‌తో) టో అండ్ థెఫ్ట్ అలర్ట్ సిస్టమ్ ఎమర్జెన్సీ స్టాప్ టెయిల్ లైట్ సిస్టమ్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఇన్‌బిల్ట్ గూగుల్ మ్యాప్స్‌తో నేవిగేషన్ అధునాతన డాష్‌బోర్డ్ ఇంటర్ఫేస్ ఇవన్నీ వినియోగదారులకు తక్కువ శ్రమతో అధిక సౌలభ్యాన్ని అందించేందుకు ఉద్దేశించినవే
Details
భారతీయుల మనసు గెలిచిన రిజ్టా
ఏథర్ రిజ్టా ఒక సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రమే కాదు. ఇది భారతీయ కుటుంబాల్లో మారుతున్న అభిరుచులు, అవసరాలకు సరిపోయేలా రూపొందించిన ఫ్యూచరిస్టిక్ వాహనం. ఏడాదిలోపే లక్ష యూనిట్లను అమ్మేసి ఈ మోడల్ ఎంతటి విజయాన్ని సాధించిందో చెప్పకనే చెప్పింది. ఫీచర్లు, డిజైన్, వినియోగదారుల అనుభవం అన్నింటిలోను రిజ్టా ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్కూటర్లలో ఒకటిగా తన స్థానాన్ని బలపర్చుకుంది.