
Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి క్లాసిక్ 650.. దీని ధరఎంతో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 సీసీ శ్రేణిని విస్తరిస్తూ మరో కొత్త మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.
వాహన ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్లాసిక్ 650 ట్విన్ మోడల్‌ను ఎట్టకేలకు గురువారం లాంచ్ చేసింది.
దీని ధరను రూ.3.37 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) నిర్ణయించగా, బ్లాక్ క్రోమ్ వేరియంట్ ధర రూ.3.50 లక్షలుగా ఉంది.
ఇప్పటికే 650 సీసీ శ్రేణిలో ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటోర్ 650, షాట్‌గన్ 650, బేర్ 650 మోడళ్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసింది.
వివరాలు
నియో-రెట్రో డిజైన్
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త క్లాసిక్ 650లో నియో-రెట్రో డిజైన్‌ను అనుసరించింది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న క్లాసిక్ 350ను పోలి ఉండే ఈ మోడల్ రౌండ్ హెడ్‌ల్యాంప్, టైగర్-ఐ పైలట్ లైట్లు, టియర్‌డ్రాప్ ఆకారంలో ఫ్యూయల్ ట్యాంక్‌ను కలిగి ఉంది.
ఇది వల్లం రెడ్, బ్రంటింగ్‌థార్ప్ బ్లూ, టీల్, బ్లాక్ క్రోమ్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.
19 అంగుళాల ముందు వీల్, 18 అంగుళాల వెనుక వీల్‌తో పాటు వైర్ స్పోక్ వీల్స్‌ను అందించారు.
వివరాలు
ఆధునిక ఫీచర్లు
ఇంజిన్ విషయానికి వస్తే, ఇతర 650 సీసీ మోడళ్ల మాదిరిగానే ఇందులో 648 సీసీ ఎయిర్-ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అందించారు.
ఇది 46.4 హెచ్‌పీ పవర్, 52.3 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందించారు.
ముందు 320ఎంఎం డిస్క్ బ్రేక్, వెనుక 300 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో పాటు డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ సదుపాయాన్ని కలిగి ఉంది.
ఎల్‌ఈడీ లైటింగ్, సెమీ-అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
బీఎస్‌ఏ గోల్డ్ స్టార్ 650 మాదిరి మోడళ్లకు ఈ మోటార్ సైకిల్ గట్టి పోటీ ఇవ్వనుంది.