Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 అమ్మకాలకు బ్రేక్.. కారణమిదే!
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో తన రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 411 మోడల్‌ను అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీని స్థానంలో త్వరలో హిమాలయన్ 452 బైక్ ను లాంచ్ చేయనుంది. హిమాలయన్ 411 ఆఫ్‌రోడ్, రైడింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇది హైవేలపై పరిమితులను ఎదుర్కొంది. రాబోయే హిమాలయన్ 452 ఈ లోపాలను సరిదిద్ది, 40hp శక్తిని అందించే సరికొత్త లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త మోడల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్ వివరాలను బైక్‌మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
కొత్త మోడల్ వివరాలను వెల్లడించని రాయల్ ఎన్ ఫీల్డ్
హిమాలయన్ 411 నిలిపివేతకు విరుద్ధంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 411ని ఇండియాలో అమ్మకాలను సిద్ధంగా ఉంచింది. స్క్రామ్ 411, ఇది హిమాలయన్ 411 ఆధారంగా రూపొందించారు. అయితే ఇది చిన్న ఫ్రంట్ వీల్, తక్కువ సౌకర్యాలను కలిగి ఉంది. ఈ మోడల్‌పై ఆసక్తిని పెంచడానికి, బైక్‌మేకర్ వచ్చే ఏడాది ప్రారంభంలో స్క్రామ్ 411 కోసం కొత్త కలర్ స్కీమ్‌లను పరిచయం చేయాలని భావిస్తున్నారు.