రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా vs హోండా హెచ్'నెస్ CB350 లెగసీ.. ఏదీ బెస్ట్?
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా నుంచి కొత్త వేరియంట్ విడుదలైంది. దీని ఎక్స్ షోరూం ధర రూ. 2.2 లక్షలు ఉండనుంది. ఈ బైక్ అరోరా గ్రీన్, అరోరా బ్లూ, అరోరా బ్లాక్ అనే మూడు రంగులలో అందుబాటులోకి వచ్చింది.
ఈ బైక్‌కు పోటీగా హోండా హెచ్'నెస్ CB350 లెగసీ నిలుస్తుందని ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2020లో ప్రవేశపెట్టిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 భారతదేశంలో మిడిల్ వెయిట్ క్రూయిజర్ సెగ్మెంట్‌ను పునరుద్ధరించింది.
ఇది J-సిరీస్ ఇంజిన్‌తో, బైక్ సబ్-500cc విభాగంలో UKలో అత్యధికంగా అమ్ముడైన మోటార్‌సైకిల్‌గా రికార్డుకెక్కింది.
H'ness CB350 లెగసీ ఎడిషన్ శక్తివంతమైన ఇంజిన్‌తో ముందుకు వచ్చింది.
Details
రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో స్టన్నింగ్ ఫీచర్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరాలో టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్, ఎత్తైన హ్యాండిల్ బార్, స్ప్లిట్-టైప్ టూరింగ్ సీట్, పెద్ద విండ్‌స్క్రీన్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, LED టెయిల్‌లాంప్ ఉన్నాయి.
హోండా హెచ్'నెస్ CB350 లెగసీ ఎడిషన్ బోల్డ్ ట్యాంక్ గ్రాఫిక్స్, 'లెగసీ ఎడిషన్' బ్యాడ్జ్‌లు, ఆల్-LED లైటింగ్ సెటప్, విశాలమైన హ్యాండిల్ బార్, అప్‌స్వేప్ట్ ఎగ్జాస్ట్, డిజైనర్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 అరోరా వేరియంట్ రూ. 2.2 లక్షలు ఉండగా, హోండా H'ness CB350 లెగసీ ఎడిషన్ ధర రూ. 2.16 లక్షలు ఉండనుంది.