Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి నయా బైక్.. అదే హిమాలయన్ 452
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ లేటెస్ట్ బైక్ హిమాలయన్ 452 లుక్ అవుట్ అయ్యింది.
ఈ మేరకు కంపెనీ తాజాగా ఆవిష్కరణలు చేసింది. వచ్చే నెల-నవంబర్‌లో ఈ నయా బైక్ లాంచ్ కానున్నట్లు సమాచారం.
2016లో లాంచ్ అయిన హిమాలయన్ 411ని, 452 అడ్వెంచర్ మోటార్‌సైకిల్ దగ్గరగా ఉంటుంది.411తో పోల్చితే ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 452లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
452 మోడల్ లో స్లీకర్ స్టైల్లో ఫ్లూయెల్ ట్యాంక్, రీడిజైన్డ్ ఫెండర్స్,స్ప్లిట్ సీట్ సెటప్ వంటివి ప్రవేశపెడుతున్నారు. ఫ్రెంట్ మడ్‌గార్డ్‌లో హిమాలయన్ బ్రాండింగ్ ఏర్పాటు చేస్తున్నారు.
ఫ్యుయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్, రేర్ ఫెండర్స్ ఉండనున్నాయి.ఇందులో క్రోమ్ ప్యానెల్‌తో కూడిన సింగిల్ ఎగ్సాస్ట్ ఉంటుంది.
details
బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.80లక్షలుగా అంచనా
452లో యూఎస్డీ ఫ్రెంట్ ఫోర్క్స్ విత్ ఫోర్క్ కవర్ వస్తోంది. 21 ఇంచ్ మల్టీ స్పోక్ వీల్స్, ఆఫ్ రోడ్ టైర్స్ అదనపు బలంగా నిలవనుంది.
451.65 సీసీతో కూడిన లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 40 బీహెచ్పీ పవర్‌ను, 45 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ బరువు 210 కేజీలు ఉండొచ్చని తెలుస్తోంది.
ఎనలాగ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ టీఎఫ్టీ డిస్ప్లే వస్తుందని, ఇందులో టర్న్ బై టర్న్ నేవిగేషన్ సెటప్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
బైక్ ఎక్స్‌షోరూం ధర రూ. 2.80లక్షలుగా ఉంటుందని సమాచారం. హిమాలయన్ 452, కేటీఎం 390 అడ్వెంచర్, బీఎండబ్ల్యూ G-310 GS, HD అడ్వెంచర్, హీరో ఎక్స్‌పల్స్ 400కి పోటీ ఇవ్వనుంది.