కొత్త టాటా హారియర్ లుక్స్ అదుర్స్.. ఎన్ని వేరియంట్లలో లభిస్తుందో తెలుసా
భారతదేశం ఆటోమోబైల్ మార్కెట్లో ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది. ఈ మేరకు టాటా హారియర్ 2023 మోడల్ సరికొత్త లుక్ ఇస్తోంది. ఇప్పటికే ఈ కారు మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. మరోవైపు బుకింగ్స్ సైతం కొనసాగుతున్నాయి. 2023 టాటా హారియర్ సెగ్మెంట్ ఫీచర్లలోనే మొదటిది కాగా ఇందులోని రెండు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లు ఈ నెలాఖరులో భారతదేశంలో అధికారికంగా విడుదల కానున్నాయి. సెప్టెంబరు 6 నుంచి బుకింగ్‌లు మొదలయ్యాయి. ఇందులో కొత్తగా 360 డిగ్రీ కెమెరా, సరికొత్త 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పొందుపర్చారు.
4 వెర్షన్లలో టాటా హారియర్
హారియర్ మోడల్స్, స్మార్ట్, ప్యూర్, అడ్వెంచర్, ఫియర్‌లెస్ అనే నాలుగు వెర్షన్లలో అందుబాటులోకి వస్తోంది. అధునాతన సాంకేతికతతో పాటు భద్రతా పరికరాలతో ఎక్స్‌టీరియర్ డిజైన్, హై ఎండ్ ఇంటీరియర్ ఫీచర్‌లతో రూపుదిద్దుకుంది. స్ట్రెచ్డ్ అవుట్ ఫ్రంట్ గ్రిల్, రివైజ్డ్ లైటింగ్‌తో ముందు వెనుక LED DRLలతో 'వెల్‌కమ్' 'గుడ్‌బై' సిగ్నేచర్ యానిమేషన్, ఎండ్ టు ఎండ్ LED DRLలను కలిగి ఉంది. ఇది డ్యూయల్ జోన్ పూర్తిగా ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, మల్టీ-ఫంక్షన్‌తో టచ్ బేస్డ్ సెంట్రల్ కంట్రోల్ ప్యానెల్, రియర్ డోర్ సన్‌షేడ్‌లు, 45W ఫాస్ట్ USB ఛార్జర్, సిగ్నేచర్ ఇల్యూమినేటెడ్ లోగోతో స్టీరింగ్ వీల్, 2వ వరుస సీట్లకు హెడ్ రెస్ట్‌లతో డిజైన్ అయ్యింది.
లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ - ADAS, ఈ కారు సొంతం
మూడ్ లైట్ థీమ్‌లు సహా పెద్ద సన్‌రూఫ్‌తోనూ కారు రూపుదిద్దుకుంది. కొత్త హారియర్ అన్ని అల్లాయ్ వీల్స్‌లో కనువిందు చేయనుంది. 31.24 సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అలెక్సా సపోర్ట్‌తో వాయిస్ కమాండ్‌లకు సహకరిస్తుంది. టాటా వాయిస్ అసిస్టెంట్ 6 భాషల్లో 250+ కమాండ్‌లను అందిస్తోంది. ADAS మరియు 6+1 ఎయిర్‌బ్యాగ్‌లతో అధునాతన భద్రతా పరికరాలతో కూడి ఉంది. మరోవైపు లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ - ADAS, ఈ కారు సొంతం. టాటా హారియర్ 6 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన శక్తివంతమైన 2.0 లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజన్‌తో శక్తిని కలిగి ఉంది.ఇంజన్ 167.6 హెచ్‌పి పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.