స్పోర్ట్స్ లుక్ ఇస్తున్న TATA Curvv Suv ఈవీ.. లాంచ్,ధరల వివరాలు తెలుసా
ప్రతిష్టాత్మకమైన టాటా వాహనాల కంపెనీ మరో కొత్త మోడల్ కి తెరలేపింది. ఇప్పటివరకు అనేక హ్యాచ్ బ్యాక్ కార్లను తయారు చేసిన టాటా, తాజాగా Curvv SUV పేరిట ఈవీ, ఐస్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు Curvv SUVని ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ ), సహా మరిన్ని ప్రీమియం ఫీచర్లతో రూపొందిస్తోంది. నెక్సాన్, పంచ్, టియాగో, సఫారి, హారియర్ వంటి వాహనాలను తెచ్చిన టాటా, ప్రస్తుతం మారుతీ సుజుకి, హ్యుందాయ్ తర్వాత భారతదేశంలోనే మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా నిలిచింది. Curvv SUV, క్రెటా, గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ కు పోటీనివ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాది FY24, Q1లో Curvvని విడుదల చేయనున్నారు.
రంజన్‌గావ్ ప్లాంట్‌లో తయారవుతున్న టాటా తొలి SUV EV, ICE మోడల్స్
పూణెలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో ప్రారంభమైన ఉత్పత్తి
ఆకట్టుకునే రీతిలో, వినూత్నంగా స్పోర్ట్ మోడల్ డిజైన్ తో అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా CURVV EV, ICE రెండు మోడళ్లను టాటా తీర్చిదిద్దుతోంది. కర్వ్ ఐస్ కంటే ఈవీ ధర ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఈ కార్లు పూణెలోని రంజన్‌గావ్ ప్లాంట్‌లో తయారవుతున్నాయి. CURVV EV, ICE వెర్షన్‌ల ఉత్పత్తి ప్రారంభమైంది. రెండు మోడళ్ల ధర Nexon వేరియంట్ ల మాదిరిగానే ఉండనుంది. ఎంట్రీ లెవల్ పెట్రోల్ MT ధర కేవలం రూ. 8 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, EV ప్రైమ్ ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా అంచనా. త్వరలోనే జరగనున్న Curvv లాంఛ్ భారత ఆటోమోబైల్ మార్కెట్లో సంచలన సృష్టించనున్నట్లు కంపెనీ ధీమా వ్యక్తం చేసింది.