వచ్చే నెల భారత రోడ్లపైకి BMW iX1 లగ్జరీ ఈవీ కారు.. దీని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే
లగ్జరీ కార్లలో బీఎండబ్ల్యూ కారుకు ఉన్న ప్రత్యేకత వేరే ఏ కారుకు లేదు. లగ్జరీ విభాగంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కారుగా బీఎండబ్ల్యూ పేరుగాంచింది. BMW తన iX1 ఎలక్ట్రిక్ SUVని వచ్చే నెలలో భారతదేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో దీని ధర రూ. 60-65 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండే అవకాశముంది. ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రీమియం ఎలక్ట్రిక్ SUVని కోరుకునే వినియోగదారులకు పర్యావరణ హిత వాహనాన్ని iX1 అందించనుంది. ఈవీ తయారీని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున, iX1 లగ్జరీ సెగ్మెంట్ లో కీలక పాత్ర పోషించనుంది. దీని సొగసైన డిజైన్, అధునాతన ఫీచర్లు మూడో తరం iX1పై ఆధారపడింది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 438 కి.మీ ప్రయాణం చేయొచ్చు
BMW ఐకానిక్ ట్విన్-కిడ్నీ గ్రిల్, పునఃరూపకల్పన, LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. EV టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, బహుళ డ్రైవింగ్ మోడ్‌లు, వివిధ భద్రతా లక్షణాలను కలిగి ఉంది. దీని శైలి, పనితీరు, అత్యాధునిక లక్షణాల కలయికతో, iX1 భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో సంచలం సృష్టించేందుకు సిద్ధంగాఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 438 కి.మీ వెళ్లవచ్చని కంపెనీ ప్రకటించింది. BMW iX1 వేరియంట్‌లో లభ్యం కానుంది. ఇది 313hp శక్తిని, 494Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వాహనం డ్యూయల్-మోటార్ సెటప్‌ను కలిగి ఉంది. 64.7kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఆధారితమైన iX1 వాహనం 11kW ఛార్జర్‌తో వస్తుంది. 130kW వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సహకరించడం గమనార్హం.