Diesel Cars: మార్కెట్లో రూ.20లక్షలలోపు డీజిల్ టాప్ కార్లు ఇవే
కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా కేంద్రం ఫోకస్ పెడుతోంది. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. కానీ ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలే అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో రూ.20లక్షల లోపు టాప్ డీజిల్ కార్ల గురించి తెలుసుకుందాం. టాటా అల్ట్రోజ్ - 8.8లక్షల నుండి ప్రారంభం ఐదు సీట్లు గల ఈ కారులో, డ్యుయల్ టోన్ డాష్ బోర్డ్, క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ ఫ్యూరిఫయర్, సన్ రూఫ్, వైర్ లెస్ ఛార్జర్, 7.0అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ ని కలిగి ఉంటుంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో ఉండే ఈ కారు బాగుంటుంది.
హ్యూండాయ్ క్రెటా - 11.96లక్షల నుండి ప్రారంభం
17అంగుళాల చక్రాలు, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్. టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి. ఐదు సీట్లు, సన్ రూఫ్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఎయిర్ ఫ్యూరిఫయర్, వైర్ లెస్ ఛార్జర్ 10.5అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ ఉంటుంది. కియా సోనెట్ - 9.95 లక్షల నుండి మొదలు: ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, 16అంగుళాల డిజైనర్ చక్రాలు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉండే ఈ కారులో ఐదు సీట్లు, 7స్పీకర్ల సౌండ్ సిస్టమ్, 10.25అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ ఛానల్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సౌకర్యాలను కలిగి ఉంది. 1.5లీటర్ల డీజిల్ మోటార్ తో 99hp/240Nm, 113hp/250Nm వేరియంట్లలో ఉంటుంది.