Citroen C3 Aircross: అకట్టుకొనే ఫీచర్లతో సిట్రోయెస్ సీ3 ఎయిర్ క్రాస్.. ధర ఎంతంటే?
సిట్రోయెన్ సంస్థ ఇండియాలోకి సీ3 ఎయిర్ క్రాస్ ను తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రచిస్తోంది. ఇప్పటికే ఈ మోడల్‌కు సంబంధించి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రూ.25 వేల టోకెన్ ధరతో సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ ను ఆ సంస్థకు చెందిన డీలర్ షిప్ షోరూం దగ్గర బుక్ చేసుకోవచ్చు. వీటి డెలివరీలు 2023 అక్టోబర్ 15 నుంచి మొదలవుతాయని సమాచారం. ఈ నేపథ్యంతో ఈ మోడల్ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇప్పటికే సీ3, ఈసీ3 మోడల్స్ ను ఇప్పటికే సిట్రోయెన్ సంస్థ లాంచ్ చేసింది. 90శాతానికి పైగా ఈ ఫీచర్స్‌ను దేశీయంగానే రూపొందించినట్లు సంస్థ ప్రకటించింది.
సిట్రోయెన్ సీ3 ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
కియా సెల్టోస్, హ్యుందాయ్ కెట్రా, వోక్సో వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్ వంటి మోడల్స్ కు సీ3 ఎయిర్ క్రాస్ మార్కెట్లో గట్టి పోటిని ఇస్తోంది. సిట్రోయెన్ సీ3 ఎయిర్ క్రాస్ ను ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీవ్ చేశామని, అప్పటి నుంచి దీనికి మంచి స్పందన వస్తోందని, భారతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మోడల్ ను రూపొందించామని సిట్రోయెన్ ఎండీ రోలాండ్ బౌచర వెల్లడించారు. వెహికల్‌లో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉండగా, ఇది 1008 హెచ్‌పీ పవర్‌ను, 190 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేయనుంది. ఎస్‌యూవీలో 2 సీటింగ్ ( 5 సీటర్, 7 సీటర్) కాన్ఫిగరేషన్ ఉంది. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షలుగా ఉండనుంది.