LOADING...
Royal Enfield: జూన్ 2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 27 శాతం పెరుగుదల
జూన్ 2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 27 శాతం పెరుగుదల

Royal Enfield: జూన్ 2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 27 శాతం పెరుగుదల

వ్రాసిన వారు Moogati Shabari
Jul 02, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. కంపెనీ మొత్తం 1,14,032 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. గత ఏడాది జూన్‌లో విక్రయించిన 89,540 యూనిట్లతో పోలిస్తే ఇది 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా దేశీయ మార్కెట్‌లో బలమైన డిమాండ్ ఉండటంతో ఈ వృద్ధి సాధ్యమైంది. అయితే ఎగుమతులు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దేశీయ మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విక్రయాలు 34 శాతం పెరిగాయి. గత ఏడాది జూన్‌లో 76,957 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది జూన్‌లో ఆ సంఖ్య 1,02,930 యూనిట్లకు చేరుకుంది. కంపెనీ మోటార్‌సైకిల్ శ్రేణిలోని అన్ని మోడళ్లకు స్థిరమైన డిమాండ్ ఉండటం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది.

వివరాలు

ఎగుమతులు 20 శాతం తగ్గుదల..

మరోవైపు, ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గాయి. జూన్ 2025లో 12,583 యూనిట్లు ఎగుమతి చేయగా, జూన్ 2026లో ఆ సంఖ్య 11,102 యూనిట్లకు పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న మందగమన ధోరణి కొనసాగుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY2026-27) ఇప్పటివరకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 3,30,427 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో విక్రయించిన 2,65,528 యూనిట్లతో పోలిస్తే ఇది 24 శాతం అధికం. ఈ కాలంలో దేశీయ అమ్మకాలు 32 శాతం పెరిగి 3,01,174 యూనిట్లకు చేరుకోగా, ఎగుమతులు 20 శాతం తగ్గి 29,253 యూనిట్లుగా నమోదయ్యాయి.

వివరాలు

విక్రయాలకు ప్రత్యేక సర్వీస్..

జూన్ నెలలో కంపెనీకి మరో ముఖ్యమైన ఘట్టం కూడా నమోదైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీలను ప్రారంభించింది. కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ బ్రాండ్ కింద తీసుకొచ్చిన ఈ మోడల్‌ను తొలుత బెంగళూరులో వినియోగదారులకు అందించడం ప్రారంభించింది. ఈ మోడల్ విక్రయాలకు ప్రత్యేక సర్వీస్, రిటైల్ వ్యూహాన్ని కంపెనీ అమలు చేస్తోంది. ఇందులో హబ్-అండ్-స్పోక్ నెట్‌వర్క్, షాప్-ఇన్-షాప్ అవుట్‌లెట్లు, అలాగే 24/7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్ వంటి సేవలు ఉన్నాయి.

Advertisement

వివరాలు

ఆ మోడల్‌కు మరింత డిమాండ్..

దశలవారీగా ఒక్కో నగరానికి విస్తరిస్తూ ఈ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి. గోవిందరాజన్ మాట్లాడుతూ, ఫ్లయింగ్ ఫ్లీ C6 డెలివరీల ప్రారంభం కంపెనీకి కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్ కూడా కంపెనీ మొత్తం అమ్మకాల వృద్ధికి దోహదపడిందని ఆయన తెలిపారు.

Advertisement