
Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డు విక్రయాలు - సెప్టెంబర్‌లో 1.24 లక్షల బైక్‌లు అమ్మకం
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ కొత్త రికార్డును నెలకొల్పింది. గత సెప్టెంబర్ నెలలో 1,24,328 మోటార్‌సైకిళ్లు విక్రయించి తన ఇప్పటి వరకు ఉన్న అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్మిన 86,978 యూనిట్లతో పోలిస్తే 43 శాతం వృద్ధి. ఆగస్టు నెలలో అమ్మిన 1,14,002 యూనిట్ల రికార్డును కూడా ఈసారి అధిగమించింది. ముఖ్యంగా దేశీయ మార్కెట్‌లో భారీ డిమాండ్ రావడం ఈ వృద్ధికి కారణమైంది.
వివరాలు
దేశీయ, ఎగుమతి విక్రయాలు
సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్‌లో 1,13,573 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది సెప్టెంబర్‌లో అమ్మిన 79,325 యూనిట్లతో పోలిస్తే 43 శాతం ఎక్కువ. ఎగుమతుల విషయంలోనూ రాయల్ ఎన్‌ఫీల్డ్ గణనీయమైన వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే నెలలో 7,653 యూనిట్లు ఎగుమతి చేయగా, ఈసారి 10,755 యూనిట్లు ఎగుమతి చేసి 41 శాతం వృద్ధి నమోదు చేసింది.
వివరాలు
350 సీసీ వరకు బైక్‌లు అమ్మకాల దుమారం
350 సీసీ ఇంజిన్ వరకు ఉన్న మోడల్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఒక్క సెప్టెంబర్ నెలలోనే 1,07,478 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 43 శాతం పెరుగుదల. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ విభాగంలో మొత్తం 5,09,610 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం అధికం.
వివరాలు
350 సీసీ పైబడి ఉన్న మోడల్స్
350 సీసీ పైబడి ఉన్న బైక్‌ల విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయి. సెప్టెంబర్ 2025లో ఈ విభాగంలో 16,850 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్మిన వాటితో పోలిస్తే 45 శాతం ఎక్కువ. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ మోడల్స్ మొత్తం 82,293 యూనిట్లు అమ్ముడవ్వగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం పెరుగుదల.