
Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ వచ్చేసింది.. కేవలం 25 యూనిట్లు మాత్రమే!
ఈ వార్తాకథనం ఏంటి
యువతలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈ బైక్‌పై ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన ఫీలింగ్‌ను ఇస్తుందని అనేక మంది భావిస్తారు. అందుకే ఈ కంపెనీ బైకులను కొనుగోలు చేయాలని అనేక మంది ఆసక్తి చూపిస్తారు. తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇది అమెరికాకు చెందిన ఐకాన్ మోటోస్పోర్ట్స్ సహకారంతో రూపొందించారు. ఈ ప్రత్యేక ఎడిషన్ బైక్ ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు మాత్రమే అమ్మకానికి ఉంచింది. భారతదేశంలో కేవలం 25 యూనిట్లను మాత్రమే విక్రయించే అవకాశం కల్పించగా, అవన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి.
Details
ధర, ఇంజిన్ స్పెసిఫికేషన్లు
ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.25 లక్షలు. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే దాదాపు రూ. 65,000 ఎక్కువ. ఇందులో 648cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఈ ఇంజిన్ 47bhp శక్తి, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది. బైక్ బరువు 240 కిలోలు.
Details
డిజైన్, ఫీచర్లు ఇవే
స్టైలిష్ పెయింట్‌తో తెలుపు, నీలం, ఎరుపు కలయికలో అందుబాటులో ఉంది. బ్లూ షాక్ అబ్జార్బర్ స్ప్రింగ్స్, గోల్డెన్ వీల్స్, రెడ్ సీట్లు, రెట్రో స్టైల్ గ్రాఫిక్స్ దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ఈ ఎడిషన్‌ను కొనుగోలు చేసిన వారికి ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్‌ను కంపెనీ అందిస్తుంది. పనితీరు, ప్రయాణ అనుభవం రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ బైక్ నగర ప్రయాణం మరియు హైవే టూరింగ్ రెండింటికీ సరిపోతుందని పేర్కొంది. దీని మంచి పనితీరు, శక్తివంతమైన ఇంజిన్, స్టైలిష్ డిజైన్ యువ రైడర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రత్యేకమైన షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ బైక్‌కు భారీ డిమాండ్ ఉండటంతో, భవిష్యత్తులో మరిన్ని ప్రత్యేక ఎడిషన్లను విడుదల చేసే అవకాశముందని పరిశీలకులు భావిస్తున్నారు.