Page Loader
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వర్సెస్ బెనెల్లీ 502C.. రెండింట్లో ఏది బెస్ట్ బైక్
రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వర్సెస్ బెనెల్లీ 502C.. రెండింట్లో ఏది బెస్ట్ బైక్

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 వర్సెస్ బెనెల్లీ 502C.. రెండింట్లో ఏది బెస్ట్ బైక్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2023
11:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల గోవాలో జరిగిన మోటావోర్స్ ఈవెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) సంస్థ కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ షాట్ గన్ 650 మోటోవర్స్ ఎడిషన్‌ను పరిచయం చేసింది. షాట్‌గన్ మోటోవర్స్ ఎడిషన్ ఎక్స్ షోరూం ధర రూ. 4.25 లక్షలుగా ఉంది. ఈ 25 యూనిట్ల డెలివరీ 2024 జనవరిలో ప్రారంభమవుతుంది. ఈ వెహికల్ పోటీగా బెనెల్లీ 502C వచ్చేసింది. ఈ రెండు బైకుల్లో ఏది బెస్ట్ ఆప్షనో ఇప్పుడు తెలుసుకుందాం. బెనెల్లీ 502C ఒక అద్భుతమైన క్రూయిజర్‌గా కనిపిస్తుంది. ఇందులో మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, డ్యూయల్-టిప్ ఎగ్జాస్ట్, స్ప్లిట్-టైప్ సీట్లు, DRLతో LED హెడ్‌ల్యాంప్, స్లిమ్ LED టైల్‌లైట్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది.

Details

షాట్‌గన్ 650 మోడల్ లో అధునాతన ఫీచర్లు

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650లో క్రూయిజర్, బాబర్ మిక్స్ ఉన్నాయి. ఇందులో ఇంధన ట్యాంక్, LED హెడ్‌ల్యాంప్, విస్తృత హ్యాండిల్ బార్, సైడ్-మౌంటెడ్, డ్యూయల్ పీ-షూటర్ ఎగ్జాస్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ రెండు బైక్‌లలో డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABSలు ఉన్నాయి. రాయల్ ఎన్ ఫీల్డ్‌ 47.65 పీఎస్ పవర్, 52 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. బెనల్లీ 47hp గరిష్ట శక్తిని, 46Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇండియాలో బెనెల్లీ 502C రూ. 5.85 లక్షలు ఉండగా, షాట్‌గన్ 650 మోడల్ ధర రూ. 4.25 లక్షలు ఉంది.