
Royal Enfield EV: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్.. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు విద్యుత్ వాహన రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంవత్సరంలోనే సంస్థ తమ తొలి విద్యుత్ మోటార్ సైకిల్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ మాతృసంస్థ అయిన ఐషర్ మోటార్స్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన సందర్భంగా నిర్వహించిన ఎర్నింగ్స్ కాల్‌లో కంపెనీ సీఈఓ బి. గోవింద్ రాజన్ వెల్లడించారు.
ఈ విద్యుత్ మోటార్ సైకిళ్లను "ఫ్లయింగ్ ఫ్లీ" అనే సబ్‌బ్రాండ్ ద్వారా మార్కెట్‌లోకి తీసుకురానున్నారు.
ఈ శ్రేణిలో "ఫ్లయింగ్ ఫ్లీ సీ6","ఎస్6" అనే రెండు మోడళ్లను ప్రవేశపెట్టనున్నారు.
వివరాలు
ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించని కంపెనీ
ఇందులో మొదటగా ఎస్6 మోడల్‌ను విడుదల చేయనుండగా,సీ6 మోడల్‌ను 2026 జనవరి నుండి మార్చి మధ్యకాలంలో మార్కెట్లోకి తేనున్నారు.
అయితే, సంస్థ ఇప్పటివరకు ఖచ్చితమైన విడుదల తేదీని ప్రకటించలేదు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధ రంగాల్లో తేలికపాటి మోటార్ సైకిళ్లను ఉపయోగించేవారు.
ఆ కాలంలో అలాంటి వాహనాలను "ఫ్లయింగ్ ఫ్లీ" అనే పేరుతో పిలిచేవారు.
ఇప్పుడు అదే పేరును రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ విద్యుత్ వాహన సబ్‌బ్రాండ్‌కు ఉపయోగించడం గమనార్హం.
ఈ ప్రాజెక్ట్‌కు స్పెయిన్‌కు చెందిన విద్యుత్ వాహన బ్రాండ్ అయిన "స్టార్క్ ఫ్యూచర్" బ్యాటరీ మేనేజ్‌మెంట్‌లో సహకారం అందిస్తోంది.
వివరాలు
విద్యుత్ వాహన ప్రాజెక్ట్‌పై 250 మంది పని చేస్తున్నారు
అలాగే, ప్రముఖ టెక్నాలజీ సంస్థ క్వాల్‌కామ్ నుంచి ఈ వాహనాలకు అవసరమైన చిప్‌సెట్‌లు అందుతున్నాయి.
ఈ విద్యుత్ వాహన ప్రాజెక్ట్‌పై మొత్తం 250 మంది రాయల్ ఎన్‌ఫీల్డ్ సిబ్బంది పని చేస్తున్నారు.
అయితే, బ్యాటరీ సామర్థ్యం, మోటార్ లక్షణాలు, ఇతర సాంకేతిక వివరాల గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.