LOADING...
 Tata Safari, Harrier: కార్ అభిమానులకు సంచలన వార్త.. హారియర్, సఫారీలో త్వరలో పెట్రోల్ ఆప్షన్
కార్ అభిమానులకు సంచలన వార్త.. హారియర్, సఫారీలో త్వరలో పెట్రోల్ ఆప్షన్

 Tata Safari, Harrier: కార్ అభిమానులకు సంచలన వార్త.. హారియర్, సఫారీలో త్వరలో పెట్రోల్ ఆప్షన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 15, 2025
11:22 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ రాబోయే కాలంలో పలు కొత్త మోడళ్లను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నది. ఈ క్రమంలో, ఎక్కువ కాలంగా ఎదురుచూస్తున్న టాటా హారియర్, టాటా సఫారీ SUVల పెట్రోల్ వేరియంట్లను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటివరకు ఈ రెండు SUVలు కేవలం డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నప్పటికీ, పెట్రోల్ వెర్షన్ లేకపోవడం వినియోగదారుల్లో అసంతృప్తికి కారణమయ్యింది. కంపెనీ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి అడుగులు వేస్తోంది. హారియర్, సఫారీ SUVలకు 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ అందుబాటులోకి వస్తుంది.

Details

280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు

ఈ ఇంజిన్‌ను 'హైపీరియన్ (Hyperion)' అని 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించారు. దీన్ని డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయడం కూడా సాద్యమని సమాచారం. ఈ టర్బో పెట్రోల్ యూనిట్ 170 హెచ్‌పీ పవర్, 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్, SUVల అప్‌డేట్స్‌పై పూర్తి వివరాలు నవంబర్ 25న టాటా సియేరా మోడల్‌తో కలిసి అధికారికంగా వెల్లడించనున్నారు. పెట్రోల్ వేరియంట్ల రావడంతో టాటా హారియర్, సఫారీ SUVలు ప్రస్తుత పోటీదారులైన జీప్ కంపాస్, ఎంజీ హెక్టర్ వంటి SUVలతో మరింత ముందుగా నిలుస్తాయని అంచనా.

Details

టాటా సఫారీ ప్రారంభ ధర రూ.14.66 లక్షలు

ప్రస్తుతం హారియర్, సఫారీ SUVలో ఉపయోగిస్తున్న 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ 167 హెచ్‌పీ పవర్, 350 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం టాటా సఫారీ ప్రారంభ ధర రూ.14.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, హారియర్ ధర రూ.14 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్ వేరియంట్ల విడుదలతో ఈ SUVల ధరలు కొంత మేర తగ్గే అవకాశం ఉంది. హారియర్, సఫారీ SUVలు జీప్ మెరిడియన్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ ఆల్కజార్ వంటి SUVలతో పోటీ పడుతుండగా, పెట్రోల్ వేరియంట్ల రాకతో ఈ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది.

Advertisement