LOADING...
NHAI: నకిలీ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక
నకిలీ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక

NHAI: నకిలీ ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్‌లపై ఎన్‌హెచ్‌ఏఐ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2026
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఫాస్ట్‌ట్యాగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్‌సైట్ల మోసాలు పెరుగుతున్నాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI)హెచ్చరించింది. అధికారిక ఫాస్ట్‌ట్యాగ్ సేవల పేరుతో నకిలీ వార్షిక పాస్‌లను అమ్ముతున్న వెబ్‌సైట్లపై ప్రజలకు జాగ్రత్తలు సూచించింది. సెర్చ్ ఇంజిన్లలో ముందుగా కనిపించేలా ఈ ఫేక్ సైట్లు ప్రకటనలు పెట్టి, నిజమైన పోర్టల్స్‌లా కనిపించేలా మోసగాళ్లు తయారు చేస్తున్నారని తెలిపింది. యూజర్లు ఈ సైట్లలోకి వెళ్లిన తర్వాత మొబైల్ నంబర్, వాహన వివరాలు, పేమెంట్ సమాచారం నమోదు చేయమని అడుగుతారు. సమాచారం ఇచ్చిన వెంటనే డబ్బులు మోసగాళ్ల ఖాతాల్లోకి మళ్లిపోతున్నాయి. చాలా సందర్భాల్లో రసీదు కూడా ఇవ్వకుండా లేదా నకిలీ రసీదులు పంపించి మోసం చేస్తున్నారు.

వివరాలు 

సున్నితమైన సమాచారం ఎవరితో పంచుకోవద్దు

ఈ విషయంపై ముందే భారత సైబర్ నేరాల సమన్వయ కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారానే ఫాస్ట్‌ట్యాగ్ సేవలు ఉపయోగించాలని సూచించింది. ఇలాంటి మోసాల నుంచి రక్షణ కోసం అధికారులు కొన్ని సూచనలు ఇచ్చారు. రాజ్ మార్గ్ యాత్ర వంటి అధికారిక యాప్‌ల ద్వారానే సేవలు పొందాలి. సెర్చ్‌లో కనిపించే స్పాన్సర్డ్ లింక్స్‌పై క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. వెబ్‌సైట్ యూఆర్‌ఎల్ సరిగా ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. ఓటీపీలు,కార్డ్ వివరాలు వంటి సున్నితమైన సమాచారం ఎవరితో పంచుకోవద్దు. అనుమానాస్పదంగా కనిపించే సైట్లను వెంటనే వదిలేయాలి. ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆర్థిక నష్టాల నుంచి రక్షించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫాస్ట్‌ట్యాగ్ పేరిట ఆన్‌లైన్ మోసాలు.. జాగ్రత్తగా ఉండాలన్న ఎన్‌హెచ్‌ఏఐ

Advertisement