Page Loader
Skoda Kodiaq: భారత మార్కెట్‌లోకి త్వరలో స్కోడా కోడియాక్‌ SUV..
భారత మార్కెట్‌లోకి త్వరలో స్కోడా కోడియాక్‌ SUV..

Skoda Kodiaq: భారత మార్కెట్‌లోకి త్వరలో స్కోడా కోడియాక్‌ SUV..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
04:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ చెక్ ఆటోమేకర్ స్కోడా భారత మార్కెట్‌లోకి కొత్త SUVని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలో తన SUV లైనప్‌లో కొత్తగా స్కోడా కోడియాక్ ను విడుదల చేయాలని సంస్థ యోచిస్తోంది. పూర్తి పరిమాణంలో ఏడు సీట్ల SUV ను త్వరలోనే భారత మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్కోడా ఆటో బ్రాండ్ డైరెక్టర్ పీటర్ జనేబా ఒక కార్యక్రమంలో ప్రకటించారు. స్కోడా కోడియాక్ 2025 ఏప్రిల్‌లో లాంచ్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. అయితే, అధికారిక లాంచ్ తేదీపై ఇంకా స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.

ఫీచర్లు 

స్కోడా కోడియాక్ SUV ముఖ్య ఫీచర్లు: 

బాహ్య రూపకల్పన (ఎక్స్‌టీరియర్ డిజైన్): ఈ SUV లో శక్తివంతమైన బ్లాక్ అవుట్ ఫ్రంట్ గ్రిల్, కొత్తగా డిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్, స్టైలిష్ సైడ్ క్లాడింగ్,ఆధునిక LED డే టైమ్ రన్నింగ్ లైట్లు(DRLs) ఉంటాయి. అంతర్గత ఫీచర్లు (ఇంటీరియర్ డిజైన్): స్కోడా కోడియాక్ SUV లో బ్లాక్ థీమ్ వినియోగించబడింది. దీంట్లో 13-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,10అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.ప్రీమియం మెటీరియల్స్,శ్రేష్ఠమైన డిజైన్ ఎలిమెంట్లు దీని క్యాబిన్‌కు లగ్జరీ అనుభూతిని అందిస్తాయి. భద్రత పరంగా,కోడియాక్ ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) తో వస్తుంది. స్కోడా కోడియాక్ శక్తివంతమైన 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్ ను కలిగి ఉంది.ఈ ఇంజిన్ 190 హార్స్‌పవర్,320 Nmటార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఫీచర్లు 

ఇంజిన్ & పనితీరు: 

ఇది సిటీ డ్రైవింగ్, ఆఫ్-రోడ్ సామర్థ్యాలకు తగిన శక్తిని అందిస్తుంది. అలాగే, 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో పాటు 4X4 డ్రైవ్‌ట్రెయిన్ ఎంపికలోనూ లభిస్తుంది. పోటీ: స్కోడా కోడియాక్ D-సెగ్మెంట్ SUV విభాగంలోకి వస్తుంది.ఇది టయోటా ఫార్చ్యూనర్, MG గ్లోస్టర్ వంటి మోడళ్లతో పోటీ పడుతుంది. ధర అంచనాలు: స్కోడా కోడియాక్ ఖచ్చితమైన ధరను లాంచ్ సమయంలో వెల్లడించనున్నారు. అయితే దీని ధర సుమారు ₹40 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని అంచనా.ఈ SUV ను మొదటిసారిగా 2025 జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించారు.అక్కడ కస్టమర్ల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ నేపథ్యంలో,కంపెనీ ఇప్పుడు భారత మార్కెట్‌లో అధికారిక లాంచ్ కోసం సన్నాహాలు చేస్తోంది.