LOADING...
Skoda Octavia RS: స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్ టీజర్ విడుదల.. బుకింగ్స్ ఎప్పుడంటే?
స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్ టీజర్ విడుదల.. బుకింగ్స్ ఎప్పుడంటే?

Skoda Octavia RS: స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్ టీజర్ విడుదల.. బుకింగ్స్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

స్కోడా ఇండియా తమ రాబోయే 'ఆక్టేవియా ఆర్‌ఎస్ (Octavia RS)' సెడాన్‌కు టీజర్ విడుదల చేసింది. కంపెనీ సోషల్ మీడియా హ్యాండిల్‌లో అప్లోడ్ చేసిన వీడియోలో ఈ కొత్త సెడాన్‌కి సంబంధించిన ముఖ్య రహస్యాలు పెద్దగా వెల్లడించబడలేదు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును భారతీయ ప్రేక్షకులకు ప్రదర్శించారు. భారత మార్కెట్లో స్కోడా ఫ్లాగ్‌షిప్ సెడాన్‌గా 'ఆక్టేవియా ఆర్‌ఎస్' వస్తుంది. ఇది కంప్లీట్లీ బిల్ట్-అప్ (CBU) యూనిట్‌గా దిగుమతి చేయబడుతుంది. దీంతో ధర అధికంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ సెడాన్ పరిమిత సంఖ్యలోనే అమ్మకం జరగనుంది.

Details

టీజర్ పై యూజర్ల స్పందన 

వినియోగదారులు టీజర్ వీడియోపై ఉత్సాహం వ్యక్తం చేశారు. ఒక యూజర్ 'లెజెండ్ ఈజ్ బ్యాక్' అంటూ స్పందించారు. అయితే కొందరు ధరను చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ధర చాలా ఎక్కువ, హార్ట్‌బ్రేక్ అయ్యిందని పేర్కొన్నారు. బుకింగ్ వివరాలు స్కోడా ప్రకారం, ఆక్టేవియా ఆర్‌ఎస్ కోసం బుకింగ్‌లు అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానున్నాయి. బుకింగ్ ప్రారంభమైన కొన్ని రోజులలో, ఈ ప్రీమియం సెడాన్ ఆధికారిక ధరను ప్రకటించడానికి కంపెనీ సిద్ధమవుతుంది.

Details

పనితీరు

ఆక్టేవియా ఆర్‌ఎస్ సాధారణ ఆక్టేవియాతో పోలిస్తే మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ సెడాన్‌లో 2.0-లీటర్ TSI ఫోర్-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 261 BHP పవర్, 370 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ కనెక్ట్‌డ్. వాహనం 0-100 కి.మీ/గం వేగాన్ని కేవలం 6.6 సెకన్లలో చేరుకుంటుంది. గరిష్ట వేగాన్ని ఎలక్ట్రానిక్‌గా 250 కి.మీ/గం వరకు పరిమితం చేశారు. పోటీదారులు ఆక్టేవియా ఆర్‌ఎస్ అదే ధర శ్రేణిలోని జర్మన్ లగ్జరీ సెడాన్‌లతో పోటీ పడనుంది. వీటిలో ఆడి A4, బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాండ్ కూపే, మెర్సిడెస్-బెంజ్A-క్లాస్ లిమౌసిన్ ఉన్నాయి. అదనంగా టయోటా కామ్రీ వంటి మోడళ్లకు కూడా ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.