Loading...
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ.10 లక్షలకే కొత్త సెడాన్‌!
స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ.10 లక్షలకే కొత్త సెడాన్‌!

Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. రూ.10 లక్షలకే కొత్త సెడాన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 06, 2026
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్కోడా ఆటో ఇండియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్లావియా ఫేస్‌లిఫ్ట్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త సెడాన్‌ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). అప్‌డేటెడ్‌ మోడల్‌లో డిజైన్‌, ఫీచర్ల పరంగా పలు మార్పులు చేయడంతో పాటు చిన్న 1.0 TSI ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను పరిచయం చేసింది. స్లావియా ఫేస్‌లిఫ్ట్ మొత్తం ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి క్లాసిక్, క్లాసిక్+, సిగ్నేచర్, స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్, మాంటే కార్లో.

వివరాలు

స్లావియా ఫేస్‌లిఫ్ట్ ధరలు ఇవే..

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో Classic 1.0 TSI MT వేరియంట్‌ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఇక Classic+ వేరియంట్‌ ధర రూ.10.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

సిగ్నేచర్ వేరియంట్‌ ప్రారంభ ధర రూ.13.94 లక్షలు కాగా.. స్పోర్ట్‌లైన్, ప్రెస్టీజ్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.14.34 లక్షలు, రూ.15.89 లక్షల నుంచి మొదలవుతాయి.

అన్నింటికంటే టాప్‌ వేరియంట్‌ అయిన మాంటే కార్లో 1.5 TSI DSG ధర రూ.18.84 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌).

వివరాలు

చిన్న ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌..

స్లావియా ఫేస్‌లిఫ్ట్‌లో ఇప్పటికే ఉన్న 1.0-లీటర్‌, 1.5-లీటర్‌ TSI టర్బో పెట్రోల్‌ ఇంజిన్లనే కొనసాగించారు. అయితే చిన్న 1.0 TSI ఇంజిన్‌కు మాత్రం కీలకమైన ట్రాన్స్‌మిషన్‌ అప్‌గ్రేడ్‌ ఇచ్చారు.

ఇకపై 1.0 TSI ఇంజిన్‌ను కొత్త 8-స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో పొందవచ్చు. దీనితో పాటు 6-స్పీడ్‌ మాన్యువల్‌ ఆప్షన్‌ కూడా ఉంటుంది.

మరోవైపు పెద్ద 1.5 TSI ఇంజిన్‌ 7-స్పీడ్‌ DSG ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో కొనసాగుతుంది.

ADVERTISEMENT

వివరాలు

కొత్త లైటింగ్‌, అప్‌డేటెడ్‌ డిజైన్‌..

కొత్త స్లావియాలో లైటింగ్‌ సెటప్‌ను కూడా రివ్యాంప్‌ చేశారు. LED హెడ్‌ల్యాంప్స్‌, LED టెయిల్‌ ల్యాంప్స్‌తో పాటు వెనుక భాగంలో సీక్వెన్షియల్‌ టర్న్‌ ఇండికేటర్లను అందించారు.

అలాగే కొత్త గ్రిల్‌ ట్రీట్‌మెంట్‌, అప్‌డేటెడ్‌ ఫ్రంట్‌, రియర్‌ డిజైన్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. కొత్త అల్లాయ్‌ వీల్‌ డిజైన్లను కూడా అందించారు.

ఇంటీరియర్‌లో కొత్త థీమ్‌లను తీసుకురావడంతో పాటు అధిక వేరియంట్లలో ఫీచర్ల జాబితాను మరింత విస్తరించారు.

టాప్‌ వేరియంట్లలో 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ కూడా ఉంది.

ADVERTISEMENT

వివరాలు

రియర్‌ సీట్‌ మసాజ్‌.. AI వాయిస్‌ అసిస్టెంట్‌..

Slavia Facelift‌ టాప్‌ వేరియంట్లలో 10.1 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ అందించారు. Prestige, Monte Carlo వేరియంట్లలో రియర్‌ సీట్‌ మసాజ్‌ ఫంక్షన్‌ కూడా ఉంటుంది.

ఇక 360-డిగ్రీ కెమెరా, ముందు-వెనుక పార్కింగ్‌ సెన్సార్లతో కూడిన 'Park Pilot' ఫీచర్‌ కూడా అందుబాటులో ఉంది.

Google Cloud టెక్నాలజీని ఉపయోగించే AI ఆధారిత వాయిస్‌ అసిస్టెంట్‌ను కూడా సెడాన్‌లో అందించారు.

వివరాలు

25కి పైగా సేఫ్టీ ఫీచర్లు..

భద్రత విషయంలోనూ స్లావియా ఫేస్‌లిఫ్ట్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. సెడాన్‌లో 25కి పైగా యాక్టివ్‌, పాసివ్‌ సేఫ్టీ ఫీచర్లు స్టాండర్డ్‌గా లభిస్తాయి. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా ఉన్నాయి.

4 ఏళ్ల వారంటీతో Skoda Super Care..

కొత్త Slavia Facelift‌తో స్కోడా సూపర్ కేర్ ప్యాకేజీని కూడా అందిస్తున్నారు. ఇందులో నాలుగేళ్లు లేదా 1 లక్ష కిలోమీటర్ల వారంటీ, నాలుగేళ్ల రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, నాలుగు లేబర్‌-ఫ్రీ సర్వీసులు ఉన్నాయి.

మొత్తంగా డిజైన్‌ అప్‌డేట్స్‌, కొత్త ఫీచర్లు, అదనపు సేఫ్టీ అంశాలతో పాటు 1.0 TSI ఇంజిన్‌కు కొత్త 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను జోడించడం Slavia Facelift‌లో కీలక మార్పులుగా నిలిచాయి.

ADVERTISEMENT