LOADING...
సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ
కారు అంతటా దాదాపు 45 సెన్సార్‌లు ఉంటాయి

సబ్-బ్రాండ్ AFEELAని ప్రకటించిన సోనీ హోండా మొబిలిటీ

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 05, 2023
01:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

CES 2023లో టెక్నాలజీ దిగ్గజం సోనీ, జపనీస్ ఆటోమేకర్ హోండా మధ్య జాయింట్ వెంచర్ అయిన AFEELA అనే EV సబ్-బ్రాండ్‌ను ప్రకటించారు. సోనీ 2020 కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)లో VISION-S కాన్సెప్ట్‌ను ప్రారంభించినప్పటి నుండి, ఈ బ్రాండ్ తన దృష్టిని ఎలక్ట్రానిక్స్ నుండి గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు మార్చడం మొదలుపెట్టింది. ఆటోనొమస్ డ్రైవింగ్‌కు సంబంధించి సోనీకి కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు ఉన్నాయి అందుకే మంచి కార్లను తయారు చేయడంలో అనేక దశాబ్దాల అనుభవం ఉన్న భాగస్వామితో కలవాలని నిర్ణయించుకుంది. AFEELA కాన్సెప్ట్ కారులో VISION-S కాన్సెప్ట్‌లో కనిపించే డిజైన్ లాంగ్వేజ్‌ ఉంటుంది. కారు అంతటా దాదాపు 45 సెన్సార్‌లు ఉంటాయి.

సోనీ

ప్రస్తుతానికి ఇంకా కాన్సెప్టు దశలోనే ఉన్న AFEELA

అయితే దీని సాంకేతిక వివరాలు ఇంకా తెలియలేదు. అయినప్పటికీ, సుమారు 500 కిమీ వెళ్లే బ్యాటరీ ప్యాక్ ఉండచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో యోక్-స్టైల్ స్టీరింగ్ వీల్, పూర్తి-వెడల్పుగా ఉన్న డిస్ప్లే ఉన్నాయి. AFEELA కాన్సెప్ట్ కారు లోపలి భాగంలో, విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్, మినిమలిస్టిక్ డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యోక్-స్టైల్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ల ద్వారా ప్రయాణీకుల భద్రతను నిర్ధారించే అవకాశం ఉంది. ధరకు సంబంధించిన వివరాలను బహుశా 2026లో లాంచ్ చేసే సమయంలో ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇది కాన్సెప్ట్ దశలో ఉంది, ఉత్పత్తి రూపంలోకి వెళ్లడానికి కొంత సమయం పడుతుంది.