
Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్ స్కూటర్ మార్కెట్లోకి రాకకు సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా తన ప్రముఖ స్కూటర్ యాక్సెస్‌లో కొత్త ఈవీ వేరియంట్‌ను ప్రవేశపెడుతోంది.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో మొదటిసారిగా ప్రదర్శించిన ఈ ఇ-యాక్సెస్ తయారీని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో ప్రారంభించినట్లు స్పష్టంచ చేసింది.
త్వరలోనే ఈ విద్యుత్ స్కూటర్ మార్కెట్లో విడుదల కానుంది. విద్యుత్ స్కూటర్ విభాగంలో ప్రవేశించేందుకు చాలా కాలం నుంచి ఎదురుచూస్తోంది.
ఇ-యాక్సెస్ ద్వారా కంపెనీ ఎంట్రీ ఇవ్వాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.
దీర్ఘకాల మన్నికతో పాటు అత్యుత్తమ థర్మల్ స్టెబిలిటీ కలిగిన ఇ-టెక్నాలజీ ఆధారంగా ఈ విద్యుత్ స్కూటర్ రూపొందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
Details
త్వరలోనే స్కూటర్ ధర వివరాలు
ఇందులో లిథియం ఐరన్ ఫాస్పేట్ (LFP) బ్యాటరీ ఉపయోగించింది.
ఈ స్కూటర్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్, ఫ్రీ బెల్ట్ డ్రైవ్ సిస్టం, రివర్స్ మోడ్, అలాగే ఎకో మోడ్, రైడ్ మోడ్ ఏ, రైడ్ మోడ్ బీ వంటి అనేక రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సుజుకీ ఇ-యాక్సెస్ 3kWh బ్యాటరీతో వస్తుంది.
కంపెనీ ప్రకారం, ఇది సుమారు 95 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. పోర్టబుల్ ఛార్జర్‌తో 6 గంటల 12 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ కానుంది. ఫాస్ట్ ఛార్జర్ వాడితే 2 గంటల 12 నిమిషాల్లో ఛార్జింగ్ పూర్తవుతుంది.
స్కూటర్ 5.5 hp పవర్, 15 Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది. స్కూటర్ ధర వివరాలను సుజుకీ వచ్చే వారంలో ప్రకటించనుంది.