Tata Sierra Rivals: టాటా సియారా క్రేజ్.. మార్కెట్లో విప్లవం సృష్టించడానికి సిద్ధమైన టాప్ ఎస్‌యూవీలు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన ఐకానిక్ మోడల్ సియారాను తిరిగి మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. 1991లో ప్రారంభించబడిన సియారా, 2003లో లభ్యం నిలిపివేశారు. 20 ఏళ్ల తర్వాత, సరికొత్త ఫీచర్లు, డిజైన్‌తో 'టాటా సియారా' మళ్లీ విడుదలైంది. ఈ ఎస్‌యూవీ ధర రూ.11.49 లక్షల నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించబడింది. డిసెంబర్ 16 నుండి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. జనవరి 15, 2026 నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సియారా ఇప్పటికే మార్కెట్లో క్రేజీ కారుగా నిలిచింది. లుక్స్, డిజైన్ పరంగా ఆకర్షణీయంగా ఉండటంతో, కొనుగోలు కోసం చాలామంది సిద్దంగా ఉన్నారు. అయితే సియారాకు పోటీ ఇచ్చే ఉద్దేశ్యంతో, ప్రముఖ కంపెనీల నుంచి కొన్ని టాప్ ఎస్‌యూవీలు కూడా త్వరలో విడుదలకానున్నాయి.
Details
మారుతి ఇ విటారా
ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మారుతి ఇ విటారా, కొత్త కియా సెల్టోస్, న్యూ ఎడిషన్ రెనాల్ట్ డస్టర్ వంటి మోడళ్లు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి ఇ విటారా ఇప్పటికే లాంచ్ అయింది. ఇది 5-సీట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ, 49kWh, 61kWh బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. కారులో డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ సెటప్ కూడా ఉంటుంది. మారుతి సుజుకి ప్రకారం, ఈ ఎస్‌యూవీ 500 కిమీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది.
Details
కియా సెల్టోస్
కియా సెల్టోస్ డిసెంబర్ 10న విడుదల కానుంది. కొత్త డిజైన్, మరింత ప్రీమియం ఇంటీరియర్‌తో మోడల్ కనిపించనుంది. అధికారిక టీజర్ ప్రకారం, కొత్త హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు, సవరించిన ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. కొత్త మోడల్ ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఎక్కువ క్యాబిన్ స్పేస్ కలిగి ఉంటుంది. అలాగే పనోరమిక్ సన్‌రూఫ్, కొత్త సీట్ అప్హోల్స్టరీ, ట్రిమ్‌లు, రీడిజైన్ డాష్‌బోర్డ్ & కంట్రోల్ ప్యానెల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి
Details
రెనాల్ట్ డస్టర్
మూడవ తరం రెనాల్ట్ డస్టర్ జనవరి 26, 2026న భారతదేశంలో విడుదల అవుతుంది. మునుపటి మోడల్ కంటే ఆధునికమైన డిజైన్, స్టైలింగ్, కొత్త గ్రిల్, రెనాల్ట్ సిగ్నేచర్ లోగో, హెడ్‌ల్యాంప్‌లు, Y-ఆకారపు LED DRLలు, కొత్త అల్లాయ్ వీల్స్, C-పిల్లర్‌లో వెనుక డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. రీడిజైన్ చేయబడిన Y-ఆకారపు టెయిల్‌ల్యాంప్‌లు కూడా ఈ మోడల్‌లో ఉంటాయి. రెనాల్ట్ డస్టర్ ఈసారి పెట్రోల్ ఇంజిన్‌లలో మాత్రమే లభిస్తుంది, 1.0-లీటర్ టర్బో, 1.3-లీటర్ టర్బో ఇంజిన్ ఎంపికలతో రానుంది.