
ఫార్ములా E రేసులకు ప్రసార హక్కులు చేజిక్కించికున్న టాటా కమ్యూనికేషన్స్
ఈ వార్తాకథనం ఏంటి
రెగ్యులేటరీ ఫైలింగ్ ద్వారా, టాటా కమ్యూనికేషన్స్ ABB FIA ఫార్ములా E వరల్డ్ ఛాంపియన్‌షిప్ కోసం అధికారిక ప్రసార పంపిణీ హక్కులు చేజిక్కించుకున్నట్టు ప్రకటించింది.
కొత్త ఒప్పందం ప్రకారం ఫార్ములా E కొత్త రిమోట్ ప్రసార ఉత్పత్తిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు హై-డెఫినిషన్, హై-రిజల్యూషన్ , హై-స్పీడ్ లైవ్ బ్రాడ్‌కాస్ట్ కంటెంట్‌ను టాటా కమ్యూనికేషన్స్ అందజేస్తుంది.
టాటా కమ్యూనికేషన్స్ సాంకేతికంగా అభివృద్ధి చేసిన మీడియా ఎడ్జ్ ప్లాట్‌ఫారమ్ ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా అంతటా 26 మీడియా ఎడ్జ్ లొకేషన్‌లను ఉపయోగించి మిల్లీసెకన్లలో ఫార్ములా E రేసుల నుండి 160 కంటే ఎక్కువ లైవ్ వీడియో మరియు ఆడియో సిగ్నల్‌లను అందిస్తుంది.
రేస్
ఈ రేస్ లో 11 టీమ్‌ల నుండి 22 మంది పోటీపడుతున్నారు
కొత్త సూపర్-ఫాస్ట్ రేస్ ప్రసార పంపిణీకి టాటా కమ్యూనికేషన్స్ ప్రత్యేకంగా శిక్షణ పొందిన నిపుణులు సపోర్ట్ ఇస్తారు, సీజన్‌లో మొత్తం 16 రేసుల్లో నిరంతరం ప్రపంచవ్యాప్త ప్రసార సేవలను అందిస్తారు.
టాటా కమ్యూనికేషన్స్ తొలిసారిగా భారతదేశంలో ABB FIA ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసుల్లో ఫార్ములా Eతో చరిత్ర సృష్టించనుంది. 2023 గ్రీన్‌కో హైదరాబాద్ E-Prixలో మహీంద్రా రేసింగ్, జాగ్వార్ TCS రేసింగ్, మసెరటి MSG రేసింగ్, NEOM మెక్‌లారెన్ ఫార్ములా E టీమ్‌తో సహా 11 టీమ్‌ల నుండి 22 మంది పోటీపడుతున్నారు. ఫార్ములా E చీఫ్ మీడియా ఆఫీసర్ ఆర్తీ దబాస్ ఫార్ములా E ప్రత్యక్ష రేస్ ప్రసార పంపిణీలో టాటా కమ్యూనికేషన్స్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.