Page Loader
టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం
ఆటో ఎక్స్‌పో 2023లో టాటా ఆల్ట్రోజ్ రేసర్ ను ప్రదర్శించారు

టాటా ఆల్ట్రోజ్ రేసర్ కార్ గురించి తెలుసుకుందాం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 18, 2023
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

టాటా మోటార్స్ తమ ఆల్ట్రోజ్ రేసర్ వెర్షన్‌ను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇది ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించింది. ఈ కారులో ఆకర్షణీయమైన డిజైన్‌ తో పాటు విశాలమైన ఫీచర్-లోడెడ్ క్యాబిన్, శక్తివంతమైన 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్టాండర్డ్ ఆల్ట్రోజ్‌తో పోల్చితే ఎక్కువ ఫీచర్లతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తుంది. భారతీయ మార్కెట్‌లో హ్యుందాయ్ i20 N లైన్, మారుతి సుజుకి బాలెనో, టయోటా గ్లాంజా వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ స్టైలిష్ డ్యూయల్ టోన్ రెడ్, బ్లాక్ పెయింట్‌వర్క్‌తో పాటు బోనెట్ నుండి పైవరకు తెల్లటి చారలతో కనిపిస్తుంది.

కార్

ఈ కార్ ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో ప్రకటించే అవకాశముంది

కారులో విశాలమైన బ్లాక్-అవుట్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ హెడ్‌లైట్‌లు ఉన్నాయి. ఫెండర్‌లపై 'రేసర్' బ్యాడ్జింగ్ అది రేసింగ్ అనుకూలమైన కార్ అని చెప్తుంది. ఇందులో టెక్నాలజీ విషయానికి వస్తే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్, వాయిస్-యాక్టివేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ ఉంది. ప్రయాణికుల భద్రత గురించి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఆన్‌బోర్డ్‌లో ఉంటాయి. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇందులో ఉంది. భారతదేశంలో టాటా ఆల్ట్రోజ్ రేసర్ ధర, ఇతర వివరాలు దాని లాంచ్ సమయంలో టాటా మోటార్స్ సంస్థ ప్రకటిస్తుంది. అయితే, ధర దాదాపు రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండచ్చని అంచనా వేస్తున్నారు.