ఆటో ఎక్స్‌పో 2023లో ప్రవైగ్ వీర్ EVను లాంచ్ చేసిన ప్రవైగ్ డైనమిక్స్
స్వదేశీ స్టార్టప్ ప్రవైగ్ డైనమిక్స్ ఆటో ఎక్స్‌పో 2023లో వీర్ EVని ప్రదర్శించింది. ఆఫ్-రోడ్ ఎలక్ట్రిక్ కారు ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ కోసం రూపొందించబడింది. ఈ వాహనాన్ని గత సంవత్సరం తన e-SUV, DEFY లాంచ్ సందర్భంగా మొదటిసారి ప్రదర్శించింది ఈ సంస్థ. ఈ మోడల్ త్వరలో సాయుధ దళాలకు ఆఫ్‌రోడర్‌గా మారబోతుంది. ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యత పెరిగింది. దాదాపు ప్రతి వాహన తయారీ సంస్థ బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్స్ (BEVలు) అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రవైగ్ డైనమిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విభాగంలో ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. e-SUV, DEFY తర్వాత, ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌లను అందించాలని ఆలోచిస్తుంది.
ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ అవుతుంది
ప్రవైగ్ వీర్ ఆఫ్-రోడింగ్‌లో ఉన్నప్పుడు మెరుగైన డిపార్చర్ యాంగిల్స్‌ను అందిస్తుంది. స్కై హుక్స్, ఎలక్ట్రిక్ వించ్, పైభాగంలో పరికరాలు లేదా ఆయుధాలను ఉంచుకునేందుకు వీలుగా ఉంటుంది.సున్నితమైన ప్రాంతాల్లో పెట్రోలింగ్ చేసే ఆర్మీ సిబ్బందికి ఇందులో ఉండే థర్మల్ నైట్-విజన్ కెమెరా సిస్టమ్ ఫీచర్ బాగా పనిచేస్తుంది. దూరం నుండి అడవి జంతువులు లేదా ప్రత్యర్ధి గుంపులు వంటి ప్రమాదాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ థర్మల్ ఇమేజింగ్ ఉపయోగపడుతుంది. అన్ని చక్రాలతో నడిచే సామర్థ్యం గల ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500కిమీ కంటే ఎక్కువ దూరం నడుస్తుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం కూడా ఉంది, 30 నిమిషాల్లో 0-80% ఛార్జ్ చేస్తుంది.