
Tata Curvv: కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్‌తో టాటా కర్వ్ మీ ఇంటికే!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అయితే టాటా కర్వ్ పై ఓసారి చూపు వేయాల్సిందే. టాటా సంస్థ డీజిల్ వేరియంట్‌లో బేస్ మోడల్‌గా స్మార్ట్ డీజిల్‌ను అందిస్తోంది.
మీరు ఈ SUV బేస్ వేరియంట్‌ను కొనాలనుకుంటే కేవలం రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించి మీ ఇంటికి తీసుకురావచ్చు.
అయితే మీ నెలసరి ఈఎంఐ ఎంత అవుతుందో తెలుసుకుందాం. టాటా కర్వ్ బేస్ డీజిల్ వేరియంట్ భారత మార్కెట్లో రూ.11.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లభ్యమవుతోంది.
ఈ కారును ఢిల్లీలో కొనుగోలు చేస్తే, సుమారు రూ.1.18 లక్షల రోడ్డు పన్ను, రూ.51,000 బీమా ఖర్చు వస్తుంది. అదనంగా TCS ఛార్జీలకు రూ.11,499 చెల్లించాలి.
Details
9శాతం వడ్డీరేటుతో ఏడేళ్లకు లోన్
వీటన్నింటి తరువాత ఈ కారు ఆన్-రోడ్ ధర సుమారు రూ.13.30 లక్షల వరకు చేరుతుంది.
కర్వ్ బేస్ వేరియంట్ (స్మార్ట్ డీజిల్) కొనాలంటే, బ్యాంకులు సాధారణంగా ఎక్స్-షోరూమ్ ధర వరకు మాత్రమే రుణం మంజూరు చేస్తాయి.
అంటే మీరు రూ.2 లక్షల డౌన్ పేమెంట్ చేస్తే, బ్యాంకు నుండి రూ.11.30 లక్షల వరకు లోన్ తీసుకోవాల్సి ఉంటుంది.
బ్యాంక్ 9శాతం వడ్డీ రేటుతో ఏడేళ్లకు లోన్ ఇస్తే, ప్రతి నెల మీరు రూ.18,188 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
Details
దాదాపు రూ.17.27 లక్షల వరకు ఉండే అవకాశం
ఈ లెక్కల ప్రకారం, ఏడేళ్లలో మీరు మొత్తం రూ.3.97 లక్షలు వడ్డీగా చెల్లిస్తారు.
అంటే కేవలం కారు ధర మాత్రమే కాదు, వడ్డీ, రోడ్ ట్యాక్స్, బీమా కలిపి మొత్తం వ్యయం దాదాపు రూ.17.27 లక్షల వరకు ఉంటుంది.
మొత్తంగా మీరు తక్కువ డౌన్ పేమెంట్‌తో మంచి SUVను కొనాలనుకుంటే టాటా కర్వ్ బేస్ డీజిల్ ఒక ఆప్షన్‌గా పరిగణించవచ్చు.