Page Loader
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే?
టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే?

టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ రిలీజ్.. లాంచ్ ఎప్పుడంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 18, 2023
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాటా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ రెండేళ్లలో మరో రెండు స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ను భారత్ లో ప్రవేశపెట్టనుంది. వీటిలో కర్వ్, సియెరా మోడళ్లు ఉన్నాయని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఎండీ శైలేష్ చంద్ర పేర్కొన్నారు. ఇక వీటి చేరికతో ఎస్‌యూవీ శ్రేణికి మరింత బలం చేకూరనుంది. ఇక ఎస్‌యూవీలైన హారియర్, సఫారి కొత్త వర్షన్స్‌ను విడుదల చేశారు. ముఖ్యంగా హారియర్, సఫారి కొత్త వర్షన్స్ గ్లోబల్ ఎన్‌సీఏపీ నుంచి అత్యుత్తమ భద్రతా రేటింగ్స్ ను పొందడం గమనార్హం.

Details

హారియర్ కొత్త వర్షన్ ధర రూ. 15.49 లక్షలు

5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో భారతీయ కంపెనీలకు చెందిన వాహనాల్లో అత్యధిక స్కోర్‌తో టాటా ఎస్‌యూవీలు ఇక్కడి రోడ్లపై అత్యంత సురక్షితమైన మోడళ్లుగా ఉన్నాయని శైలేష్ చంద్ర స్పష్టం చేశారు. ఎక్స్ షోరూంలో హారియర్ కొత్త వర్షన్ ధర రూ. 15.49 లక్షలు ఉండగా, సఫారి రూ.16.19 లక్షలు ఉండనుంది. హారియర్, సఫారీ 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మోటారును పొందుతుంది ఇది గరిష్టంగా 170 PS శక్తిని, 280 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్ ఆప్షన్ అందుబాటులో ఉంటే హారియర్, సఫారీ అధిక అమ్మకాలను సాధించే అవకాశం ఉంది. ఈ రెండింట్లో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతాయి. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.