Tata Motors: 2,50,000 యూనిట్ల మార్క్ ను చేరుకున్న టాటా మోటార్స్ EV విభాగం
ఈ వార్తాకథనం ఏంటి
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహన విభాగం TATA.ev, భారత్‌లో ఇప్పటివరకు 2,50,000 కంటే ఎక్కువ కార్లు అమ్మి ఘనమైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ వాహనాలు ఇప్పుడు 1,000 కి పైగా పట్టణాలు, నగరాల్లో నడుస్తున్నాయి. 2020లో తమ మొదటి ప్రధాన EV - Nexon.ev ను ప్రారంభించిన తరువాత, టాటా మోటార్స్ భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో అగ్రస్థానంలో ఉందని ప్రకటించింది.
వివరాలు
భారత EV మార్కెట్లో టాటా మోటార్స్ ఆధిపత్యం
భారత ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్లో 66% షేర్‌తో టాటా మోటార్స్ ఆధిపత్యం కలిగింది. ప్రస్తుతం కంపెనీ EV పోర్ట్‌ఫోలియోలో Tiago.ev, Punch.ev, Nexon.ev, Curvv.ev, Harrier.ev వంటి మోడల్స్ ఉన్నాయి. అలాగే, ఫ్లీట్ కస్టమర్ల కోసం XPRES-T EV ను కూడా అందిస్తోంది. టాటా మోటార్స్ తెలిపింది, తమ EV వినియోగదారులలో 84% మంది EVను ప్రధాన వాహనంగా వాడుతున్నారు, 26% పైగా కస్టమర్లు ఈ వాహనం ద్వారా మొదిసారిగా కారు కొనుగోలు చేశారు.
వివరాలు
టాటా EVలు 1.7 మిలియన్ టన్నుల CO2 ను ఆదా చేశాయి
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, టాటా EVలు సుమారు 12 బిలియన్ కిలోమీటర్ల ప్రయాణం చేసి, 1.7 మిలియన్ టన్నుల CO2 ఉద్గారాలను,సుమారు 80 కోట్లు లీటర్ల ఇంధనాన్ని ఆదా చేసాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల MD & CEO శైలేశ్ చంద్ర మాట్లాడుతూ, ఈ మైలురాయి ఎలక్ట్రిక్ మోబిలిటీ భారతీయుల రోజువారీ జీవితంలో వేగంగా భాగమవుతున్నదని సూచిస్తుంది.
వివరాలు
EV ఛార్జింగ్ ఈకోసిస్టమ్‌ను విస్తరించనున్న టాటా
టాటా మోటార్స్ 2,00,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లు కలిగిన EV ఛార్జింగ్ ఈకోసిస్టమ్‌ను హోమ్, కమ్యూనిటీ, పబ్లిక్ ఛార్జింగ్ ద్వారా అందిస్తోంది. 20,000కి పైగా పబ్లిక్ ఛార్జర్స్‌ను కవర్ చేసే చార్జింగ్ అగ్రిగేటర్ కూడా ఉంది. ముఖ్యమైన రూట్లపై 120 kW పై స్పీడ్ కలిగిన 100 మెగా చార్జింగ్ హబ్‌లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో, టాటా Sierra.ev మరియు కొత్త Punch.ev మోడల్‌లను CY26లో లాంచ్ చేయాలని ప్లాన్ చేసుతోంది.
వివరాలు
2030 వరకు 1 మిలియన్ ఛార్జింగ్ పాయింట్ల లక్ష్యం
FY30 నాటికి, టాటా 5 కొత్త EV నేమ్‌ప్లేట్లు, పోర్ట్‌ఫోలియోలో అప్డేట్లను విడుదల చేయాలని ప్లాన్ చేసింది. CY27 నాటికి 4,00,000 ఛార్జింగ్ పాయింట్లను, 2030 నాటికి 1 మిలియన్ పాయింట్లను చేరవేయాలని లక్ష్యం పెట్టుకుంది. అలాగే, బ్యాటరీ పునర్వినియోగం, రిఫర్బిష్‌మెంట్ సర్వీసులు, లోకలైజేషన్ ప్రయత్నాలు (Sanandలో Agratas గిగాఫ్యాక్టరీ నుండి బ్యాటరీ సెల్స్ సప్లై) పై కూడా దృష్టి సారిస్తుంది.