Tata Punch: రూ. 17,000 పెరిగిన 'టాటా పంచ్' కారు ధర
టాటా మోటార్స్ తమ కార్ల ధరలను ఫిబ్రవరి 1 నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరల పెంపు ప్రభావం కస్టమర్లపై ఇప్పుడు కనిపిస్తోంది. కంపెనీ తన అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో 'ఎస్‌యూవీ పంచ్'ను కూడా ఖైరీదైనదిగా మారింది. ధరలు పెంచడం వల్ల 'టాటా పంచ్' కారుపై రూ.17,000 పెరిగింది. సవరించిన ధరలతో 'టాటా పంచ్' ఎక్స్-షోరూమ్ ధర రూ.6.13 లక్షలుగా మారింది. ఇది అంతకుముందు రూ. 5.99 లక్షలుగా ఉండేది. టాటా పంచ్‌లో ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్, క్రియేటివ్ అనే నాలుగు వేరియట్లు ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్సెటర్ ప్రారంభ ధర కూడా రూ. 612,800గా ఉందని కంపెనీ తెలిపింది.
టాటా పంచ్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
టాటా పంచ్‌లో 1.2లీటర్ రెవోట్రాన్ ఇంజన్ ఉంటుంది. ఇది స్టాండర్డ్‌గా 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ని కలిగి ఉంటుంది. టాటా పంచ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 18.97 kmpl, ఆటోమేటిక్‌లో 18.82 kmpl మైలేజీని పొందొచ్చు. టాటా పంచ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో ఏసీ, ఆటోమేటిక్ హెడ్‌లైట్లు, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, మక్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 వాహనాల జాబితాలో టాటా పంచ్ ఉంది. భద్రతా కోణం పరంగా చూస్తే.. టాటా పంచ్ గ్లోబల్ ఎన్‌సీఏపీ 5స్టార్ రేటింగ్‌ను పొందింది. టాటా నెక్సన్, టాటా ఆల్ట్రోజ్ తర్వాత ఇప్పుడు టాటా పంచ్ గ్లోబల్ ఎన్‌సీఎపీ నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.