NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / ఆటోమొబైల్స్ వార్తలు / Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ భారతదేశంలో లాంచ్​కు సన్నదం.. ఇవే  హైలైట్స్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ భారతదేశంలో లాంచ్​కు సన్నదం.. ఇవే  హైలైట్స్ 
    టాటా సియెర్రా ఈవీ భారతదేశంలో లాంచ్​కు సన్నదం.. ఇవే హైలైట్స్

    Tata Sierra EV : టాటా సియెర్రా ఈవీ భారతదేశంలో లాంచ్​కు సన్నదం.. ఇవే  హైలైట్స్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 24, 2025
    03:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా ఈవీ త్వరలో భారతదేశంలో లాంచ్‌కి సిద్ధమవుతోంది.

    ప్రస్తుతం ఈ మోడల్ రోడ్ టెస్ట్ దశలో ఉంది.ఇటీవల కామోఫ్లాజ్‌లో కనిపించిన ఈ వాహనం ద్వారా పలు కీలక వివరాలు బయటపడ్డాయి.

    టాటా సియెర్రా ఈవీ - అంచనాలు

    టాటా సియెర్రా ఈవీ,ఐసీఈ వెర్షన్‌తో పాటు అందుబాటులోకి రానుంది.టాటా కర్వ్ ఈవీ,హారియర్ ఈవీల కంటే ముందుగా ఈ మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.ఇది టాటా మోటార్స్‌ నుంచి ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVగా నిలవనుంది.

    టెస్ట్ మ్యూల్ & డిజైన్ ఎలిమెంట్స్

    సియెర్రా ఈవీ టెస్ట్ మ్యూల్,గట్టిగా కప్పబడి ఉన్నట్లు స్పై ఇమేజెస్ వెల్లడించాయి.దీంతో డిజైన్ ఎక్కువగా గోప్యంగా ఉన్నప్పటికీ,కొన్ని కీలక స్టైలింగ్ ఎలిమెంట్లు కనిపించాయి.

    వివరాలు 

    ఈ వాహనంలో: 

    నిటారుగా ఉండే ఫ్రంట్ ఫ్యాసియా

    నిలువుగా అమర్చిన రెక్టాంగ్యులర్ LED హెడ్‌లైట్స్

    ఏడీఏఎస్ సెన్సార్‌తో వెడల్పాటి ఎయిర్ డ్యామ్

    ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్

    రేర్ బంపర్‌లో రిజిస్ట్రేషన్ ప్లేట్ హోల్డర్

    ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, షార్క్ ఫిన్ యాంటెనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ వంటి అంశాలు ఉంటాయి.

    2025 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన కాన్సెప్ట్ మోడల్‌కు భిన్నంగా ఈ వాహనం వస్తుందని అంచనా. ఏయిరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ప్రధాన మార్పుగా కనిపిస్తోంది.

    వివరాలు 

    ఇన్‌టీరియర్ & ఫీచర్లు 

    టాటా సియెర్రా ఈవీ విస్తృత శ్రేణి కనెక్టివిటీ ఫీచర్లు అందించనుంది.

    పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

    శక్తివంతమైన స్టీరింగ్ వీల్, టచ్-ఆధారిత కంట్రోల్స్

    పనోరామిక్ సన్‌రూఫ్

    ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్

    360° సరౌండ్ వ్యూ కెమెరా

    వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు

    ఏడీఏఎస్ సూట్ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి.

    వివరాలు 

    పవర్ట్రెయిన్ & రేంజ్ 

    టాటా సియెర్రా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు.

    ఐసీఈ వెర్షన్ లో:

    2.0L క్రియోటెక్ డీజిల్ ఇంజిన్

    1.5L టీజీడీఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తాయి. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి.

    లాంచ్ డేట్ & అప్‌డేట్స్ టాటా సియెర్రా ఈవీ లాంచ్ డేట్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

    లాంచ్ తేదీ, రేంజ్, ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆటో మొబైల్

    తాజా

    Stock market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1281 పాయింట్లు,నిఫ్టీ 346 పాయింట్లు చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Pm Modi: భవిష్యత్తు తరాలకు మీరు ఆదర్శం.. భారత సైన్యాన్ని అభినందించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Pm Modi: భారత సైనిక పరాక్రమం త్రివిధ దళాల ఐక్యతకు ప్రతీక: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Cockroaches and Lizards: బొద్దింకలు, బల్లుల సమస్యతో ఇబ్బంది పడుతున్నారా?.. ఐతే ఈ సులభమైన పద్ధతితో చెక్ పెట్టండి..! జీవనశైలి

    ఆటో మొబైల్

    Mahindra vehicles: డిసెంబర్‌లో మహీంద్రా వాహనాల అమ్మకాల్లో 16శాతం వృద్ధి మహీంద్రా
    Citroen Basalt Prices Increased: సిట్రోయెన్ బసాల్ట్ ఎస్‌యూవీ ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? ధర
    MG Windsor EV: విండ్సార్‌ ఈవీ ధర పెంపుతో పాటు ఫ్రీ ఛార్జింగ్ సదుపాయం నిలిపివేత! ఆటోమొబైల్స్
    2025 Bajaj Pulsar RS200: 2025 బజాజ్ పల్సర్ RS200 సమాచారం లీక్.. సమాచారం లీక్ ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025