LOADING...
Tata Sierra Hexa: బోల్డ్ లుక్‌లో టాటా సియెర్రా హెక్సా.. 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో హాట్ ఎంట్రీ
బోల్డ్ లుక్‌లో టాటా సియెర్రా హెక్సా.. 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో హాట్ ఎంట్రీ

Tata Sierra Hexa: బోల్డ్ లుక్‌లో టాటా సియెర్రా హెక్సా.. 7-సీటర్ SUV సెగ్మెంట్‌లో హాట్ ఎంట్రీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ రంగంలో ఒకప్పుడు డిజైన్ ఐకాన్‌గా నిలిచిన టాటా సియెర్రా SUV, ఇప్పుడు ఆధునిక రూపంలో తిరిగి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన డిజిటల్ రెండరింగ్‌లో, టాటా సియెర్రా హెక్సా నేమ్‌ప్లేట్‌తో 7-సీటర్ SUVగా ప్రదర్శించారు. డిజిటల్ ఆర్టిస్ట్ షోయబ్ ఆర్. కలానియా రూపొందించిన ఈ కాన్సెప్ట్, ఓ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేయబడింది. ఈ SUV వాస్తవంలో వచ్చినట్లయితే, మార్కెట్‌లో సంచలనం సృష్టించవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Details

డిజైన్ విశేషాలు 

సియెర్రా హెక్సా బోల్డ్, మస్క్యులర్ లుక్‌తో 7-సీటర్ SUVగా ఉంది. ఒరిజినల్ సియెర్రాకు ప్రత్యేకమైన గ్లాస్‌హౌస్ డిజైన్ కొనసాగించబడింది. ఫైవ్-డోర్ లేఅవుట్, ప్రాక్టికల్ అవసరాలకు అనుగుణంగా జోడించబడింది. ముందు భాగంలో బాక్సీ ఫ్రంట్ ఫేసియా, కొత్త LED DRLs, వెడల్పైన గ్రిల్ SUVకి రోడ్ ప్రెజెన్స్ పెంచుతున్నాయి. పొడవైన వీల్‌బేస్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు ప్రీమియమ్ ఫీలింగ్ ఇస్తున్నాయి. వెనుక భాగం క్లిన్, మోడర్న్ టెయిల్‌గేట్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Details

మార్కెట్ పోటీ 

టాటా సియెర్రా హెక్సా ఉత్పత్తిలోకి వస్తే భారత హాట్ త్రీ-రో SUV సెగ్మెంట్లోకి అడుగు పెట్టినట్లే అవుతుంది. ప్రధాన పోటీ వాహనాలు: మహీంద్రా XUV7XO - టెక్నాలజీతో నిండిన క్యాబిన్, శక్తివంతమైన ఇంజిన్లు హ్యుందాయ్ ఆల్కాజార్ - అర్బన్ ఫ్యామిలీలకు అనువైన ప్రీమియమ్ SUV MG హెక్టర్ ప్లస్ - విశాలమైన ఇంటీరియర్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు టయోటా ఇన్నోవా హైక్రాస్ - కంఫర్ట్, నమ్మకానికి బెంచ్‌మార్క్

Advertisement

Details

 సియెర్రా లెగసీ 

ఒరిజినల్ టాటా సియెర్రా 1990ల ప్రారంభంలో భారత తొలి లైఫ్‌స్టైల్ SUVగా విడుదలైంది. మూడు డోర్లు, బలమైన నిర్మాణంతో అది అప్పట్లో ఐకాన్‌గా నిలిచింది. 2020 ఆటో ఎక్స్‌పోలో సియెర్రా కాన్సెప్ట్‌ను ప్రదర్శించి, నాస్టాల్జియాను ఫ్యూచరిస్టిక్ డిజైన్‌తో తిరిగి తీసుకొచ్చారు. ఇప్పుడే, కొత్త తరం సియెర్రా మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతుండగా, హెక్సా ప్రేరణతో7-సీటర్ వెర్షన్ వస్తే కుటుంబ అవసరాలు, SUVప్రేమికుల అభిరుచులను తీరుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది కేవలం డిజిటల్ రెండర్ అయినప్పటికీ, అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. టాటా మోటార్స్ నిజంగా దీన్ని వాస్తవంలోకి తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిందే. అయినప్పటికీ, డిజైన్ చూస్తే మార్కెట్‌లో టాటా సియెర్రా హెక్సా కాన్సెప్ట్ SUV హంగామా సృష్టించేది ఖాయమని స్పష్టంగా చెప్పొచ్చు.

Advertisement