LOADING...
Andhra Taxi App:  ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం
ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం

Andhra Taxi App:  ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 22, 2025
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కొత్త ప్రణాళిక..క్యాబ్ సర్వీస్'కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతంలో ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ ఆపరేటర్లు బైక్, కారు క్యాబ్ సర్వీసులకు ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం, రద్దీ సమయంలో ఫీజులు పెరుగుతూ, తక్కువ దూర ప్రయాణాలకూ అధిక ఛార్జీలు విధిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రజలు తప్పనిసరిగా ఈ ప్రైవేట్ సర్వీసులను మాత్రమే ఉపయోగిస్తున్నారని గుర్తించి, ప్రభుత్వమే స్వయంగా ఓ యాప్ తీసుకురానుంది.

వివరాలు 

ఆంధ్రా ట్యాక్సీ యాప్ పరిచయం

ఏపీ ప్రభుత్వం ఆంధ్రా ట్యాక్సీ అనే కొత్త యాప్‌ను త్వరలో విడుదల చేయనున్నది. దీని ద్వారా ప్రజలకు తక్కువ ధరల్లో ఆటో,ట్యాక్సీ సౌకర్యాలు అందించనుంది. ప్రారంభ దశలో, ఎన్టీఆర్ జిల్లా పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ సేవలను ప్రారంభించనున్నారు. దుర్గగుడి, భవానీ ద్వీపం వంటి పర్యాటక ప్రాంతాలకు కూడా యాప్ ద్వారా ప్రజలు తక్కువ ఖర్చులో చేరవచ్చు. ప్రస్తుతం విజయవాడలోని స్థానిక ఆటో, క్యాబ్ డ్రైవర్లు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న కారణంగా ప్రయాణికుల జేబుకు భారంగా మారింది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభుత్వం స్వయంగా యాప్ తీసుకురానుందని ప్రకటించింది. ప్రభుత్వ వర్గాల ప్రకారం, ఈ యాప్ పర్యాటకులను ఆకర్షించడమే కాక, ప్రజలకు నాణ్యమైన క్యాబ్ సేవలు అందించడంలో కీలక పాత్ర వహిస్తుందని భావిస్తున్నారు.

వివరాలు 

యాప్ ఎలా పని చేస్తుంది?

ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలతో లాగిన్ కావాలి. వెళ్లాలనుకునే ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తే, ఆ ప్రాంతంలో నమోదైన డ్రైవర్ల వివరాలు యాప్‌లో కనిపిస్తాయి. సమీపంలో ఉన్న డ్రైవర్లు మిమ్మల్ని పిక్ చేసేందుకు వస్తారు. అలాగే, వాట్సప్ లేదా ఫోన్ కాల్ ద్వారా కూడా బుకింగ్ చేసుకునే సదుపాయం అందించబడుతుంది. మహిళల భద్రత కోసం, వాహనాల డేటా, బుకింగ్ వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కి రియల్ టైమ్‌లో అందేలా యాప్ రూపొందించబడింది.

Advertisement