
Best Mileage Cars: రోజువారీ ప్రయాణానికి బెస్ట్ ఛాయిస్.. ఈ CNG కార్లు బైక్ కంటే చౌకగా!
ఈ వార్తాకథనం ఏంటి
మీరు రోజూ ఆఫీసుకు, వ్యాపార పనులకోసం ప్రయాణించే కారు కొనాలనుకుంటే, మొదట చూసుకోవాల్సిన అంశం మైలేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మంచి మైలేజ్ ఇచ్చే ఫోర్ వీలర్ ఎంచుకుంటే, రోజువారీ ప్రయాణాల్లో ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అదే సమయంలో, ఆ కారు ధర కూడా మీ బడ్జెట్‌కు తగ్గట్లుగా ఉండాలి.
మార్కెట్లో ఇప్పుడున్న బెస్ట్ మైలేజ్ కార్లు ఇవే వీటిలో మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందినవైతే, రెండోది టాటా మోటార్స్ కార్.
కంపెనీల ప్రకారం, ఒక్క కిలో CNGతో ఈ కార్లు 27 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయి. అంటే బైక్‌తో పోల్చితేనూ తక్కువ ఖర్చుతో అధిక మైలేజ్‌ను అందిస్తున్నాయి.
Details
మారుతి సుజుకి సెలెరియో CNG
ఈ కార్ 998cc సామర్థ్యం గల 3 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. DOHC టెక్నాలజీ ఆధారంగా ఈ ఇంజన్ 56 bhp పవర్ & 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
సేఫ్టీ కోసం సెలెరియో CNGలో 6 ఎయిర్ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
కంపెనీ ప్రకారం ఈ కార్ ఒక కిలో CNGతో 34.43 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.89 లక్షలు.
Details
టాటా టియాగో CNG
టియాగో CNG 1199cc సామర్థ్యం గల 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది DOHC టెక్నాలజీతో పని చేస్తూ, 74 bhp పవర్ & 96.5 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు 1 కిలో CNGతో 26.49 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. టియాగో CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.49 లక్షల వరకు ఉంటుంది.
Details
మారుతి సుజుకి ఆల్టో K10 CNG
ఆల్టో K10 CNG కార్‌కు 998cc సామర్థ్యంతో కూడిన 3 సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది SOHC టెక్నాలజీతో పనిచేస్తూ, 56 bhp పవర్ & 82.1 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది.
సేఫ్టీ విషయంలో ఇందులో 6 ఎయిర్‌బ్యాగులు, ESP, EBDతో ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
ఈ కారు 1 కిలో CNGతో 33.40 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 5.89 లక్షలు.
మొత్తం మీద మెరుగైన మైలేజ్, బడ్జెట్ ధర, ఫీచర్ల కలయికలో ఇవి మార్కెట్లో లభ్యమవుతున్న బెస్ట్ CNG కార్లు. మీ అవసరాన్ని బట్టి వీటిని ఎంపిక చేసుకోవచ్చు.