
BMW G 310 RR: భారతదేశంలో ప్రారంభమైన బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్
ఈ వార్తాకథనం ఏంటి
బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియన్ మార్కెట్లో తన ప్రత్యేక జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్ను ప్రారంభించింది. ఈ బైకును కేవలం ₹2.99లక్షల(ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉంచారు. ఇది సాధారణ జీ 310 ఆర్ఆర్ ధర కంటే ₹18,000 తక్కువ.ముఖ్యంగా,ఈ ప్రత్యేక ఎడిషన్ కేవలం 310 యూనిట్లకే పరిమితం చేయబడింది,అంటే కేవలం 310మంది మాత్రమే ఈ బైకును సొంతం చేసుకోవచ్చు. భారతదేశంలో బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ ఇప్పటికే 1,000యూనిట్లు అమ్మకంలో నిలిచిన సందర్భంగా,ఈ ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్‌లో ప్రధానంగా కాస్మెటిక్ అప్‌డేట్లు చేయబడ్డాయి;యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవు. ప్రత్యేకంగా ,ఫ్యూయెల్ ట్యాంక్ పై "1/310" బ్యాడ్జ్ ఉంటుంది.ఈ బైక్ రెండు వేర్వేరు బేస్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది.
వివరాలు
ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ మద్దతు
బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్ లిమిటెడ్ ఎడిషన్‌లో 312 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది, ఇది గరిష్టంగా 9,700 rpm వద్ద 34 bhp పవర్, 7,700 rpm వద్ద 27.3 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ మద్దతు ఉంది. అదనంగా, ఈ బైకులో రైడ్-బై-వైర్ త్రాటిల్, రైడింగ్ మోడ్స్, డ్యూయల్-చానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, కలర్ TFT డిస్ప్లే వంటి ఆధునిక ఫీచర్లు సమకూరుస్తాయి.