
Skoda Octavia RS : రూ.50 లక్షల కార్‌కి క్రేజ్ పీక్‌లో.. బుకింగ్స్ అన్ని క్షణాల్లో క్లోజ్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్‌కు విపరీతమైన క్రేజ్ నెలకొంది. మార్కెట్‌లో కేవలం 100 యూనిట్లు మాత్రమే విక్రయానికి ఉంచగా, బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే అన్ని స్లాట్లు ఫుల్ అయ్యాయి! స్కోడా ఇండియా, ఆక్టేవియా ఆర్‌ఎస్‌ను అక్టోబర్ 17న అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. రూ. 2.50 లక్షల అడ్వాన్స్‌తో బుకింగ్స్ ప్రారంభం చేసింది. అయితే అంచనాలను మించి స్పందన రావడంతో, లాంచ్‌కు ముందే 100 కార్లన్నీ అమ్ముడయ్యాయి.
Details
కలర్స్ - ఆకర్షణీయమైన ఆరు ఎంపికలు
2025 స్కోడా ఆక్టేవియా ఆర్‌ఎస్ ఒక్క ఫుల్-లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది. అందుబాటులో ఉన్న పెయింట్ ఆప్షన్లు ఇవీ మాంబా గ్రీన్ మ్యాజిక్ బ్లాక్ రేస్ బ్లూ క్యాండీ వైట్ వెల్వెట్ రెడ్ ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సిగ్నేచర్ మాంబా గ్రీన్ భారత్‌లో కూడా ఈ మోడల్‌కు ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తోంది.
Details
స్టైలిష్ స్పోర్టీ ఎక్స్‌టీరియర్
'RS' బ్యాడ్జ్‌కు తగ్గట్లుగానే ఈ సెడాన్ అగ్రెసివ్ లుక్‌ను కలిగి ఉంది. ముఖ్యమైన బాహ్య హైలైట్స్ గ్రిల్, బంపర్‌లు, సైడ్ విండోస్, టైల్‌పైప్ చుట్టూ గ్లోస్ బ్లాక్ యాక్సెంట్స్ ముందు గ్రిల్‌పై వీఆర్‌ఎస్ లోగో స్మోక్డ్ ఫినిష్‌తో LED హెడ్‌లాంప్స్ రెడ్ పెయింటెడ్ బ్రేక్ కాలిపర్స్ నలుపు రంగు బూట్ లిప్ స్పాయిలర్ ఈ ఎలిమెంట్స్ కారుకు స్పోర్టీ, కాంట్రాస్ట్ స్టైల్‌ను ఇస్తాయి.
Details
ఇంటీరియర్ - ఆల్ బ్లాక్ థీమ్ & ఆర్‌ఎస్ టచ్
క్యాబిన్ మొత్తం ఆల్-బ్లాక్ డిజైన్‌తో ఉంటుంది. అందులో ప్రత్యేకతలు ఎరుపు కాంట్రాస్ట్ స్టిచింగ్ బ్లాక్ హెడ్‌లైనర్ ఇంటిగ్రేటెడ్ హెడ్‌రెస్ట్‌లతో స్పోర్ట్స్ సీట్లు ఆర్‌ఎస్ ప్రత్యేకమైన గ్రాఫిక్స్‌తో ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వర్చువల్ కాక్‌పిట్ డిస్‌ప్లే ఫ్రీస్టాండింగ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ప్రీమియం సాఫ్ట్-టచ్ కంట్రోల్స్
Details
2025 ఆక్టేవియా ఆర్‌ఎస్ - కీలక ఫీచర్లు
10 ఎయిర్‌బ్యాగ్‌లు ఆల్-LED లైటింగ్ సిస్టమ్ 19-ఇంచ్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ స్పోర్ట్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ 12.9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ హెడ్-అప్ డిస్‌ప్లే త్రీ-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ హీటింగ్, కూలింగ్, మసాజ్ & మెమరీతో ఫ్రంట్ స్పోర్ట్స్ సీట్లు వైర్‌లెస్ మొబైల్ ప్రొజెక్షన్ మల్టిపుల్ టైప్-C ఛార్జింగ్ పోర్టులు 675W కాంటన్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఆర్‌ఎస్ స్పెషల్ వర్చువల్ కాక్‌పిట్ గ్రాఫిక్స్